Begin typing your search above and press return to search.

టార్చర్‌ భరించలేక సినిమాలు మానేసి చదువుకోవాలనుకుందట!

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:30 AM GMT
టార్చర్‌ భరించలేక సినిమాలు మానేసి చదువుకోవాలనుకుందట!
X
సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న నెపొటిజం గురించి ఒకొక్కరు ఒక్కో మాదిరిగా స్పందిస్తూ వస్తున్నారు. చాలా మంది బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారిని ప్రస్తుతం ఉన్న స్టార్స్‌ ఎదగనివ్వడం లేదు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోలు హీరోయిన్స్‌ అంతా కూడా నెపొటిజం వల్ల ఇబ్బందులు పడ్డ వారే అంటున్నారు. తాజాగా తమిళ నటి విద్య ప్రదీప్‌ ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలు మరియు నెపొటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సోషల్‌ మీడియ ద్వారా విద్య ప్రదీప్‌ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి షేర్‌ చేసింది. కెరీర్‌ ఆరంభంలో తాను టార్చర్‌ అనుభవించాను. ఆ సమయంలో తాను ఆరు సినిమా ఛాన్స్‌ లు కోల్పోయాను. ఏ కారణంతో సినిమాల నుండి తప్పించారు అనే విషయాన్ని కూడా తెలియదు. అప్పుడు నాకు గుండెలు పలిగినంత బాధ అనిపించింది. ఇక్కడ నా వల్ల కాదనుకుని మళ్లీ చదువుకోవాలనుకున్నాను. చదువుపై దృష్టి పెట్టిన సమయంలో ‘తడం’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది.

తడం చిత్రంలో నాతో మంచి పాత్రను దర్శకుడు మగిల్‌ తిరువేణి వేయించారు. ఆ పాత్ర సక్సెస్‌ అవ్వడంతో నాపై నమ్మకం కలిగింది. బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారు ఇబ్బందులు పడటం కామన్‌ గా భావించి కష్టపడటం మొదలు పెట్టాను అంది. బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు కఠోరంగా శ్రమిస్తేనే ఇండస్ట్రీలో రాణించగలరు. టార్చర్‌ ను తట్టుకుని నిలబడే సత్తా ఉంటేనే సినిమాల్లో ప్రయత్నించాలంటూ కొత్త వారికి ఈమె సూచించింది.