Begin typing your search above and press return to search.
'అర్జున్ రెడ్డి' ఇంపాక్ట్ కోసమే ఈ తపన!
By: Tupaki Desk | 19 Feb 2019 4:58 PM GMTఒక సినిమాని పూర్తిగా తెరకెక్కించాక ఇది క్యాన్సిల్ అంటూ స్క్రాప్ లో కి విసిరేయడం అన్నది హిస్టరీలో చాలా అరుదు. అలాంటి ఓ అరుదైన సన్నివేశం ఎదురైంది దర్శకుడు బాలాకు. అతడు చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన `వర్మ` (అర్జున్ రెడ్డి రీమేక్) చిత్రం డైలెమాలో పడిపోయింది. అంతా పూర్తయ్యాక సరిగా ఔట్ పుట్ రాలేదని, మొత్తం సినిమాని స్క్రాప్ లో వేస్తున్నామని ప్రకటించి నిర్మాతలు సంచలనం సృష్టించారు. బాలాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ పరాకాష్టకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటుపై పరిణామాలు తెలిసిందే. ధృవ్ కెరీర్ బావుండాలని తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు బాలా ప్రకటించారు. ఇదంతా గతం అనుకుంటే వర్తమానంలో కథే మారిపోయింది.
ఆ సినిమాని స్క్రాప్ లో వేసి దర్శకుడిని మార్చి తిరిగి తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వెర్షన్ కు అసిస్టెంట్ గా పని చేసిన గిరీశం ను ఈసారి దర్శకుడిగా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధృవ్ సరసన బాలీవుడ్ కథానాయిక బానిట సంధు, ప్రియా ఆనంద్ లను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఆదిత్య వర్మ అనే టైటిల్ ని ప్రకటించేశారు. పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ధృవ్ రగ్గ్ డ్ లుక్ ఆకట్టుకుంది. మునుపటితో పోలిస్తే ఇంపాక్ట్ ఎక్కువే ఉందని అర్థమవుతోంది.
అయితే ప్రతిసారీ అర్జున్ రెడ్డి మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రయత్నిస్తే అది సరైనదేనా? అన్నది ఆలోచించుకోవాలి. ఇక ఒకరిని చూసి కాపీ కొట్టే విధానం సరికాదు. రీమేక్ అయినా మక్కీకి మక్కీ దించకుండా ఒరిజినాలిటీ అనేది కనిపించాలి. మొత్తానికి లుక్ బాగానే ఉన్నా.. కంటెంట్ ని ఎలివేట్ చేయడంలో అర్జున్ రెడ్డి మార్క్ ని అందుకుంటారా? లేదా? అన్నది చూడాలి. అంతకుమించి తీయాలి? అన్న ఒత్తిడి దర్శకుడిపై పని చేయకపోతే కచ్ఛితంగా బాగానే తీస్తాడనే భావించాల్సి ఉంటుంది. అంచనాలను అందుకునే ప్రయత్నంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు. అందుకు పకడ్భందీగానే ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి. రవి.కె. చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా రధన్ ని ఎంపిక చేశారు. ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ముఖేష్ ఆర్.మెహతా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.