Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌కు రాలేం.. తంబీలు ఇందుకే శ‌భాష్‌!

By:  Tupaki Desk   |   11 March 2020 6:50 AM GMT
థియేట‌ర్ల‌కు రాలేం.. తంబీలు ఇందుకే శ‌భాష్‌!
X
టిక్కెట్టు పై థియేట‌ర్ల యాజ‌మాన్యం-ప్ర‌భుత్వాల బాదుడు మితిమీరింద‌న్న విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. జీఎస్టీ అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. గ‌డిచిన రెండేళ్ల కాలంలో టిక్కెట్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ స‌హా చిన్న సినిమా హాల్ కి వెళ్లాల‌న్నా ప్రేక్ష‌కులు ఆలోచించాల్సిన ప‌రిస్థితి. ఇక స్టార్ హీరోల సినిమాల‌కైతే మొద‌టివారం ఇష్టానుసారం రేట్లు పెంచి దండుకోండ‌ని ప్ర‌భుత్వాలే స్వేచ్ఛ‌నిస్తున్నాయి కాబ‌ట్టి..య‌థేశ్చ‌గా దోపిడీ సాగుతోంది. బ్లాక్ దందా త‌గ్గినా.. ఈ త‌ర‌హా దోపిడీ ఇప్పుడు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్.

తెలుగు సినిమాల సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడుకు వెళితే అక్క‌డి డిస్ట్రిబ్యూష‌న్ సంఘాలు ప్రేక్ష‌కుల ప‌క్షాన నిల‌బ‌డి శ‌మ‌ర శంఖం పూరించాయి. ఈ నెల 27 నుంచి అక్క‌డ సినిమాలు విడుద‌ల చేయ‌మ‌ని త‌మిళ సినీ పంపిణీదారుల సంఘం స‌మాఖ్య నిర్ణ‌యించింది. పంపిణీ దారుల ఆదాయంలో 10 శాతం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని... సినిమా టిక్కెట్ పై 12 శాతం జీఎస్టీ వ‌సూలు చేస్తున్నార‌ని... దాంతోపాటు స్థానిక సంస్థ‌ల కోసం 8 శాతం ఎల్.బీ.టీ ప‌న్ను కూడా అద‌నంగా బాదేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దీంతో సినిమాకు వ‌చ్చే ప్రేక్ష‌కుడిపై అధిక భారం ప‌డుతోంద‌న్న ఆవేద‌నా వ్య‌క్త‌మైంది.

అందుకే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం మానేసార‌ని.. ఇదే కొన‌సాగితే తాము వ్యాపారం కూడా మానుకుని కొత్త మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంద‌ని తంబీ పంపిణీ వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఈనెల 27 నుంచి కొత్త సినిమాలు విడుద‌ల చేయ‌డం కుద‌ర‌ద‌ని త‌మిళ‌నాడు రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్ యాజ‌మాన్య‌లు... పంపిణీ సంఘాలు నిర్ణ‌యించాయి. దీంతో కోలీవుడ్ సినిమాపై పెద్ద పంచ్ ప‌డిన‌ట్లే అయింది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ భ‌యంతో కొన్ని చోట్ల‌ థియేట‌ర్లు మూసేసే ప‌రిస్థితి త‌లెత్తింది. తాజా నిర్ణ‌యంతో అక్క‌డ హీరోలు - నిర్మాత‌ల్లో మ‌రింత‌ ఒణుకు మొద‌లైంది.