Begin typing your search above and press return to search.

ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు

By:  Tupaki Desk   |   3 Aug 2018 10:42 AM GMT
ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు
X
తమిళ దర్శకుడు సి. శివకుమార్ అనుమానాస్పద మృతి తమిళ సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో విగతజీవిగా పడి ఉన్నాడు. శివకుమార్ మరణానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చెన్నైలోని సాలిగ్రామంలోని ఓ అపార్ట్ మెంట్ లో శివకుమార్ నివాసం ఉంటున్నాడు. తాజాగా ఆయన మృతదేహం అపార్ట్ మెంట్ లో కుళ్లిపోయి కనిపించింది. ఇతడిది ఆత్మహత్య - లేక హత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శివకుమార్ మృతి చెంది శవం కుళ్లిపోయే వరకూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎందుకు పట్టించుకోలేదన్న కోణంలో కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు.

తమిళ లెజెండరీ దర్శకుడు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడి గా పనిచేసిన శివకుమార్ అనంతరం గొప్ప దర్శకుడిగా ఎదిగాడు. శివకుమార్ దర్శకత్వంలో తమిళ అగ్ర హీరో అజిత్ ‘రెట్టయి జాడి వయసు’ అనే చిత్రంలో నటించాడు. స్టార్ హీరో అర్జున్ నటించిన ఆయుధ పూజై చిత్రానికి కూడా శివకుమారే దర్శకుడు. అనంతరం పలు సినిమాలు తీసి పాపులర్ అయ్యాడు.

కాగా శివకుమార్ మృతి చెందడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కు పంపారు. రిపోర్టు ఆధారంగా అది ఆత్మహత్యా.? హత్య అన్నది తేలనుంది.