Begin typing your search above and press return to search.
తెలుగు తెరపై తమిళ దర్శకుల జోరు!
By: Tupaki Desk | 25 Jun 2022 4:45 AM GMTటాలీవుడ్ దర్శకులు కథల విషయంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కథల స్థానంలో ఇప్పుడు కాన్సెప్టులు వినిపిస్తున్నాయి. పాటలు లేకపోయినా హిట్ కొట్టే ఫార్ములాలు వచ్చేస్తున్నాయి. ఆడియన్స్ కూడా కొత్తదనానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తమిళ దర్శకుల జోరు పెరిగిపోతోంది. అందుకు కారణం ఇక్కడి దర్శకులలో విషయం లేక కాదు .. హీరోలు ఒకే సమయంలో ఎక్కువ ప్రాజెక్టులు సెట్ చేస్తూ ఉండటం .. ఇక్కడి స్టార్ డైరెక్తర్లు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే.
తమిళ దర్శకులు గతంలో తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేవారు. ఇప్పుడు తెలుగులో చేసిన సినిమాలు తమిళంలోను రిలీజ్ చేసుకుంటారు .. అంతే తేడా. తమిళ దర్శకులకు అక్కడి ప్రేక్షకులకు ఏం కావాలనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడి హీరోలకి తమిళ మార్కెట్ పెరుగుతుంది. ఇక ఇక్కడి సినిమా బడ్జెట్ పరిధి ఎక్కువగా ఉండటం మరో కారణంగా చెప్పుకోవాలి. దర్శకులు తాము చెప్పదలచుకున్న విషయంలో రాజీ పడవలసిన అవసరం దాదాపుగా ఉండదు. అందువల్లనే ఈ మధ్య కాలంలో కోలీవుడ్ దర్శకులు టాలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.
కోలీవుడ్ లో మాత్రమే .. అక్కడి హీరోలతో మాత్రమే సినిమాలు చేయడానికి ఇష్టపడే శంకర్, ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శంకర్ సినిమాను తట్టుకునే స్థాయికి ఇక్కడి బ్యానర్లు ఎదిగాయి. ఇక్కడి హీరోల మార్కెట్ కూడా సరిహద్దులు దాటి వెళుతోంది.
చరణ్ హీరోగా శంకర్ చేస్తున్న సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కియారా అద్వాని అందాల సందడి చేయనుంది. ఇక లోకేశ్ కనగరాజ్ తో కూడా చరణ్ ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
రామ్ కూడా తమిళ దర్శకుడు లింగుసామితో 'ది వారియర్' చేశాడు. తెలుగు .. తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కృతి శెట్టి కనువిందు చేయనుంది. ఇక చైతూ కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేస్తున్నాడు.
కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేయనున్నారు. తమిళ దర్శకులతో చేయడానికి టాలీవుడ్ హీరోలు ఆసక్తిని చూపిస్తున్నట్టే, తెలుగు దర్శకులతో చేయడానికి కోలీవుడ్ స్టార్స్ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఆ జాబితాలో విజయ్ .. ధనుశ్ .. విశాల్ .. శివకార్తికేయన్ .. సూర్య కనిపిస్తుండటం విశేషం.