Begin typing your search above and press return to search.
సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ కన్నుమూత
By: Tupaki Desk | 17 Sep 2020 6:50 AM GMTతమిళంలో విజయ్ హీరోగా అనుష్క హీరోయిన్ గా రూపొంది సూపర్ హిట్ అయిన 'వెట్టైకరన్' సినిమా దర్శకుడు బాబు శివన్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడంతో అక్కడ ఆరోగ్యం మరింతగా క్షీణించి కన్నుమూశారు. ఇటీవల బాబు శివన్ ఇద్దరు కుమార్తెలు నీట్ పరీక్ష కోసం వెళ్లారు. వారితో పాటు ఆయన భార్య కూడా వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబు శివన్ భార్య పిల్లలు వచ్చే సమయంకు కుప్పకూలి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ కేవలం కోవిడ్ పేషంట్స్ కు మాత్రమే చికిత్స జరుగుతుందని చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలించారు.
బాబు శివన్ కు పరీక్షలు నిర్వహించిన ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు లంగ్స్ మరియు కాలేయం పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అతడి చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు అంత మొత్తంను చెల్లించలేక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తీసుకు వెళ్లారు. అక్కడ డయాలసీస్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్నారు. ఈసమయంలో అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించి మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. దర్శకుడి ఆర్థిక పరిస్థితి విషయంలో కుటుంబ సభ్యులకు స్టార్స్ ఎవ్వరు కూడా సాయంగా నిలవలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.