Begin typing your search above and press return to search.
వీడియో: శర్వానంద్ కోసం కార్తీ గానం
By: Tupaki Desk | 26 Aug 2022 5:00 PM GMTవెర్సటైల్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా `ఒకే ఒక జీవితం`. రీతూ వర్మ కథానాయిక. ఈ సినిమాలో శర్వా తల్లిగా అమల అక్కినేని కనిపించనున్నారు.
తెలుగు- తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు- ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
తాజాగా కార్తీ నటించిన మారిపోయే ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో కనిపించడమే కాకుండా కార్తీ తెలుగులో తన మొదటి పాటతో గాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. ప్రమోషనల్ ట్రాక్ కి తగ్గట్టు తన గాత్రాన్ని అందించాడు. కార్తీ గంభీరమైన స్వరం ఈ పాటకు ప్లస్.
టైటిల్ కి తగ్గట్టుగానే సమయం గడిచేకొద్దీ ప్రతిదీ ఎలా మారుతుందో పాటలో చెప్పిన తీరు ఆకట్టుకుంది.
ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. ఈ విషయాన్ని పాటలో ఆవిష్కరించారు. పాటలోని ఆంగ్ల పంక్తులను ట్రావిస్ కింగ్ హమ్ చేశారు. కార్తీ ప్రమోషనల్ సాంగ్ తప్పకుండా తల్లీకొడుకుల బంధాన్ని పెంచే చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. ఈ ప్రమోషనల్ పాటలో బాల నటీనటుల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది.
శర్వా కొన్ని ఫ్లాపుల తర్వాత ఒక బంపర్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. కంబ్యాక్ ఇప్పుడు అతడికి చాలా అవసరం. దీనికోసం అతడు చాలా కాలం పాటు వేచి చూసాడు. శర్వా ఆశించిన హిట్టు వస్తుందా లేదా? టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని కథతో అతడి ప్రయత్నం ఏ మేరకు ఆడియెన్ కి కనెక్టవుతుంది అన్నది వేచి చూడాలి.