Begin typing your search above and press return to search.
40 కోట్ల అప్పు తీర్చేసిన ఆ హీరో ఎవరు?
By: Tupaki Desk | 25 Nov 2016 7:30 PM GMTపెద్ద నోట్లను రద్దు చేస్తున్న నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూనే.. ఈ నిర్ణయాన్ని ముందే కొందరికి లీక్ చేశారేమో.. దీని వల్ల నల్లడబ్బు భారీగా ఉన్న పెద్ద తలకాయలు చాలామంది సేఫ్ అయిపోయారేమో అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఈ నిర్ణయం వెలువడటానికి ముందు భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన కొన్ని లావాదేవీలు కొంచెం సందేహాలు రేకెత్తించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల కిందట పెద్ద నోట్ల రద్దు కోరుతూ లేఖ రాయడంపైనా సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఓ తమిళ స్టార్ హీరో వ్యవహారం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది.
తమిళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కథానాయకుడు మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఏకంగా 40 కోట్ల రూపాయల అప్పు తీర్చాడన్న వార్త సంచలనం రేపుతోంది. తనకు తెలిసిన ఫైనాన్షియర్ దగ్గర ఈ 40 కోట్ల మొత్తం అప్పు తీసుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన ఆ హీరో.. ఆ తర్వాత అప్పు తీర్చమని ఎంతగా అడిగినా స్పందించలేదట. అలాంటిది మోడీ నిర్ణయం ప్రకటించడానికి ముందు తనే స్వయంగా అప్పు కట్టేశాడట. దీంతో ఈ నిర్ణయం గురించి ఆ హీరోకు ముందే తెలుసని.. ఇలా చాలామందికి ముందే లీకులిచ్చారని అంటున్నారు అక్కడి జనాలు. ఐతే ఆ హీరోగారు మాత్రం తాను యాదృచ్ఛికంగానే అప్పు తీర్చడం జరిగిందని.. తనకు పెద్ద నోట్ల రద్దు గురించి ముందుగా ఏమీ తెలియదని అంటున్నాడట. ఐతే హీరో ఇచ్చిన నోట్ల కట్టల్ని ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నాడట ఆ ఫైనాన్షియర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/