Begin typing your search above and press return to search.

హీరో పెళ్లి కోసం ఫ్యాన్స్‌ మోకాళ్ల మొక్కుబడి

By:  Tupaki Desk   |   4 Oct 2020 5:30 PM GMT
హీరో పెళ్లి కోసం ఫ్యాన్స్‌ మోకాళ్ల మొక్కుబడి
X
తమిళ హీరో శింబు వయసు వచ్చి పోతున్నా కూడా ఇంకా కూడా పెళ్లికి సిద్దం అవ్వడం లేదు. ఆయన ఎప్పుడో పది పన్నెండు ఏళ్ల క్రితమే ఒక హీరోయిన్‌ తో పెళ్లికి సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో లవ్‌ బ్రేకప్‌ అవ్వడంతో కొంత కాలం సింగిల్‌ గా ఉండి మళ్లీ మరో హీరోయిన్‌ తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికి పెళ్లి పీఠల వరకు వచ్చింది. అలాంటి సమయంలో వారి మద్య కూడా గొడవలు వచ్చి విడిపోయారు. ఇప్పుడు మళ్లీ శింబు అధికారికంగా అయితే సింగిల్‌. ఆయన పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల సినిమాల సంఖ్య తగ్గించడంతో పెళ్లికి రెడీ అవుతున్నాడేమో అంటూ వార్తలు వచ్చాయి. తమిళ మీడియాలో శింబు పెళ్లి గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లి విషయమై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్‌ ఇవ్వలేదు అన్నారు. దాంతో నిరాశ పడ్డ అభిమానులు పెళ్లి విషయంలో శింబు ఆలోచన మార్చాలంటూ తమిళనాడులోని రత్నగిరి కొండను మోకాళ్లతో ఎక్కి మొక్కు చెల్లించారు. శింబు పెళ్లి జరగాలని కోరుకుని తాము ఈ పని చేసినట్లుగా వారు చెబుతున్నారు. ఇలాంటి అభిమానుల కోసం అయినా శింబు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంను నెటిజన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.