Begin typing your search above and press return to search.

ఎద్దుతో స‌హా రంగంలోకి దిగిపోయాడు!

By:  Tupaki Desk   |   15 April 2022 2:30 AM GMT
ఎద్దుతో స‌హా రంగంలోకి దిగిపోయాడు!
X
త‌మిళ స్టార్ హీరో సూర్య చాలా ఒడిదుడుకుల త‌ర్వాత వ‌రుస‌గా రెండు బంప‌ర్ హిట్లు కొట్టాడు. ఆకాశం నీ హ‌ద్దురా- జైభీమ్ చిత్రాలు అత‌డి కంబ్యాక్ కి స‌హ‌క‌రించాయి. ఇదే ఊపులో మ‌రింత ఉడుంప‌ట్టు ప‌ట్టాల‌న్న‌ది అత‌డి ఉద్ధేశం. దానికి త‌గ్గ‌ట్టే కంటెంట్ ప‌రంగా వైవిధ్యంగా వెళుతున్నాడు. ఇప్పుడు రాబోతున్న వాడివాస‌న్ కూడా అదే తీరుగా వెరైటీ కాన్సెప్టుతో వ‌స్తున్న‌దే. ఈ మూవీకి ప్ర‌చారం కూడా అద‌ర‌గొడుతున్నాడు సూర్య‌. తాజాగా అత‌డు త‌మిళ న్యూఇయ‌ర్ విషెస్ ని చెప్పేందుకు ఇదిగో ఇలా ఎద్దుతో స‌హా రంగంలోకి దిగిపోయాడు!

న‌డిప్పిన్ నాయ‌గ‌న్ @సూర్య .. త‌మిళ న్యూ ఇయ‌ర్ శుభాకాంక్ష‌లు.. ప్ర‌త్యేక వీడియోతో... #సూర్య అంటూ ట్విట్ట‌ర్ లో సందేశాన్ని ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

త‌దుప‌రి బాలాతోనూ జోరుగా..

సూర్య - బాల కాంబినేష‌న్ చిత్రం సూర్య 41 సెట్స్ లో ఉంది. దాదాపు 18 సంవత్సరాల విరామం తర్వాత సూర్య - బాలల మూడవ కలయికలో ఈ చిత్రం వ‌స్తోంది. తాత్కాలికంగా సూర్య 41 అని దీనికి టైటిల్ పెట్టారు.

గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రమిది. ఈ చిత్రం సోమవారం సెట్స్ పైకి వచ్చింది. వీరిద్దరు ఇంతకు ముందు నందా- పితామగన్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ ప్రకటనను అభిమానులతో పంచుకున్న సూర్య- దర్శకుడు బాలాతో ప‌నిచేయ‌డానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం తనకు ప్రతి ఒక్కరి నుండి శుభాకాంక్షలు కావాలి అని కూడా చెప్పాడు. కీర్తి సురేష్ ని ఇందులో కథానాయికగా తీసుకున్నట్లు చిత్ర నిర్మాతలు ఇదివ‌ర‌కూ ప్రకటించారు.

ఈ చిత్రాన్ని 2 డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య - జ్యోతిక సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్ ని తీసుకున్నారు. సూర్య 41 సినిమా షూటింగ్ తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. గత ఏడాది అక్టోబర్ 28న ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. బాలాతో రెండు దశాబ్దాల అనుబంధం గురించి హృదయపూర్వకంగా నోట్ రాశాడు సూర్య‌. అతను నాపై నా కంటే ఎక్కువ నమ్మకం ఉన్న వ్యక్తి. అతను నన్ను కొత్త ప్రపంచాలను అనుభవించేలా చేశాడు. 20 ఏళ్ల తర్వాత మా నాన్న (శివకుమార్) ఆశీస్సులతో అదే ఉత్సాహంతో బాలాతో కలిసి మరో అందమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను.. అని ఎమోష‌న‌ల్ అయ్యాడు.

జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు బాలా 2001 చిత్రం `నంద సూరరై పొట్రు` నటుడి కెరీర్ లో పెద్ద బ్రేక్. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్‌ పాత్రలో నటించాడు. 2003 తమిళ చిత్రం పితామగన్ కోసం సూర్య మరోసారి దర్శకుడు బాలాతో జతకట్టాడు. ఈ చిత్రంలో విక్రమ్- సంగీత - లైలా- సూర్య‌ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో చితన్ పాత్రకు గాను విక్రమ్ ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నాడు.