Begin typing your search above and press return to search.
రియల్ హీరోలంటే తమిళ రీల్ హీరోలే బాస్
By: Tupaki Desk | 4 Dec 2015 5:58 AM GMTతెర మీద కనిపించే హీరోలు.. రియల్ లైఫ్ హీరోలుగా కనిపించటం కాస్త అరుదైన వ్యవహారం. కానీ.. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో.. దారుణమైన పరిస్థితుల్లో ఉన్న చెన్నై మహానగరంలో లక్షలాది మంది ప్రజలకు కష్టాలకు సినిమా హీరోలు స్పందిస్తున్న తీరు చూస్తే ముచ్చటేయక మానదు.
సగటు మనిషి కోసం వారు తపిస్తున్న తీరు చూసినప్పుడు వారి మీద అభిమానం మరింత పెరుగుతుంది. విపత్తు ఎదురైనప్పుడు.. ఆర్థిక సాయం ప్రకటించటం మామూలే. నిజానికి సినీ రంగ ప్రముఖులు ప్రకటించే మొత్తాలు.. వారికున్న ఆర్థిక బలంతో పోలిస్తే పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినవేం కాదు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయిలు పారితోషికం తీసుకునే వేళ.. పది లక్షలు.. పదిహేను లక్షలు.. పాతిక లక్షలు అన్నవి పెద్ద మొత్తాలేం కాదు. కానీ.. ఆర్థిక సాయం ప్రకటించటం సంగతి తర్వాత.. బాధితులకు సాయం చేసేందుకు తామే స్వయంగా రంగంలోకి దిగటం చూసినప్పుడుఅసలుసిసలు హీరోల్లా కనిపిస్తారు.
చెన్నైను చుట్టు ముట్టిన వరదల కారణంగా.. వరద తీవ్రతను బయట ప్రపంచానికి తెలియ జేయటంతో పాటు.. బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు తపిస్తున్న తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నటీనటుల తపన వారిని రియల్ లైఫ్ హీరోలుగా చేసిందని చెప్పక తప్పదు. హీరో సిదార్థ్ కావొచ్చు.. హారోయిన్ అమీ జాక్సన్ కావొచ్చు.. ఇలా చెప్పుకుంటే పలువురు నటీనటులుగా ఆర్థిక సాయానికి మించిన పని చేస్తున్నారు.
మరో యువ హీరో విశాల్ నే చూడండి. ఆయన తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. తాను ప్రేమించే చెన్నై మహానగరం నీళ్లల్లో మునిగిపోవటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. వర్షాలు.. వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. సాయం కోసం హాహాకారాలు చేస్తుంటే ఆయన కదిలిపోతున్నారు.
తనకు తాను స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనటం విశేషం. చెన్నైకి 500కిలోమీర్ల దూరంలో ఉన్న రాజపాళ్యంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఆయన.. ఇప్పుడు చెన్నై నగరానికి హుటాహుటిన బయలుదేరుతున్నారు. తానున్న ప్రాంతంతో పోలిస్తే.. చెన్నైలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారటంతో వారికి తన వంతు సాయం చేసేందుకు వీలుగా ఆయన నడుం బిగిస్తున్నారు.
ప్రజల సమస్యలకు స్పందిస్తున్న హీరో విశాల్ ట్విట్టర్ అకౌంట్ కి సాయం చేయాలన్న వినతుల జోరుగా వస్తున్నాయి. వాటి అన్నింటికి స్పందిస్తూ.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న విశాల్ లాంటి వాళ్లను చూస్తే.. ప్రజాసేవ చేస్తామని పదవుల్లో ఉన్న ఎంతో మంది నేతలు కంటే రీల్ హీరోలు రియల్ హీరోలుగా మారిపోతున్నారని చెప్పక తప్పదు.