Begin typing your search above and press return to search.
అక్కడ ఐశ్వర్య దూకుడు..!
By: Tupaki Desk | 3 May 2023 11:07 AMచూడగానే మన పక్కింటి అమ్మాయిలా అనిపించే హీరోయిన్స్ కొంతమంది ఉంటారు అందులో ఒకరు తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన రాజేష్ తనయురాలు ఆమె. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు.
తమిళ సినిమాలతో పరిచయమై తెలుగులో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. శైలజా కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ సినిమాల్లో నటించింది అమ్మడు. తనకు ఇచ్చిన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న అమ్మడు కెరీర్ లో సక్సెస్ జోష్ ని రుచి చూడలేకపోతుంది.
సినిమాలు వరుసగా చేస్తున్నా సరే వాటితో అమ్మడికి తగిన ఐడెంటిటీ మాత్రం రావట్లేదు. అయితే ఈ మధ్య సినిమాలతో పాటుగా ఓటీటీ వెబ్ సీరీస్ లలో కూడా ఐశ్వర్య రాజేష్ ఎక్కువగా కనిపిస్తుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, రన్ బేబీ రన్, స్వప్ణ సుందరి సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ ని అలరిస్తుంది ఐశ్వర్య.
సినిమా ఎక్కడ పడితే ఏంటి చెప్పండి ఈ సీరీస్ లు చూసిన ఓటీటీ ప్రేక్షకులు ఐశ్వర్యకి మంచి పాత్ర పడితే అదరగొట్టేస్తుందని చెప్పుకుంటున్నారు.
హీరోయిన్స్ లో సహజంగా నటించే వారు చాలా తక్కువ. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కేవలం పాటలకే అంకితం అవుతుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్స్ కి మంచి స్టోరీ పడితే మాత్రం తప్పకుండా ఆమె లైం లైట్ లోకి వస్తుందని చెప్పొచ్చు. తెలుగులో చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో ఆమెతో సినిమా అంటే ఎవరు ముందుకు రావట్లేదు.
అందుకే వచ్చిన ఛాన్స్ లను వాడుకుంటూ అది సినిమా అయినా ఓటీటీ వెబ్ సీరీస్ అయినా చేస్తూ వస్తుంది ఐశ్వర్య రాజేష్. మరి రాబోతున్న రోజుల్లో అయినా ఐశ్వర్యా రాజేష్ కి మంచి ఆఫర్లు వచ్చి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.