Begin typing your search above and press return to search.

గురకపైన సినిమా.. బాక్సాఫీస్ హిట్

By:  Tupaki Desk   |   29 May 2023 10:22 AM GMT
గురకపైన సినిమా.. బాక్సాఫీస్ హిట్
X
ఈ మధ్యకాలంలో సౌత్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ లతో సినిమాలు వస్తోన్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలుగా ఇంటరెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమాలు మొత్ టాక్ తో ప్రజలకి చేరువ అవుతున్నాయి. ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా తమిళ్ వచ్చిన ఓ మూవీ హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా మనుషులలో గురక సమస్య ఎక్కువగా ఉన్నవారు కనిపిస్తారు. శారీరక అలసట, అధిక బరువు సమస్యతో ఉన్న వారు గురక ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాగే శ్వాస సంబందిత సమస్యలు ఉన్న గురక అధికంగా వస్తుంది. ఇదే సమస్యపై ఇప్పుడు ఒక మూవీని కోలీవుడ్ లో తీసి హిట్ కొట్టారు. గుడ్ నైట్ టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ మూవీ కథలోకి వెళ్తే హీరో మణి కందన్ కి గురక సమస్య ఉంటుంది. ఆ సమస్య కారణంగా అక్క భావ ఇంట్లో ఉన్న హీరో వారికి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు.

ఈ సమస్య కారణంగా అతను నిత్యం అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా హీరోయిన్ మీరా రఘునాథ్ తో అతను ప్రేమలో పడతాడు.

ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ వరకు వెళ్తుంది. అయితే తనకి గురక ఉందనే విషయాన్ని అతను గోప్యంగా ఉంచి పెళ్లి చేసుకుంటాడు. తరువాత భర్తకి ఉన్న గురక సమస్య ఉందని హీరోయిన్ కి తెలుస్తుంది. ఇక విషయం తెలిసిన తర్వాత వారి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తాయి. వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనే పాయింట్ తో కథ ఉంటుంది.

దర్శకుడు ఈ సినిమాని స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్స్, అలాగే గురక నేపథ్యంలో కావాల్సినంత వినోదాన్ని క్రియేట్ చేసి ఆడియన్స్ కూర్చోబెట్టగలిగాడు. అందుకే ఈ మూవీ తమిళనాట భాగా కనెక్ట్ అయ్యింది. హీరోయిన్ దగ్గర సీక్రెట్ దాచి పెళ్లి చేసుకోవడం తరువాత ఇబ్బందులు పడటం అనేది కామన్ పాయింట్ అయిన దానిని గురక అనే సమస్య చుట్టూ అల్లుకోవడం ఆకట్టుకుంది.