Begin typing your search above and press return to search.

ఆరేళ్ల సినిమా పురస్కారాల్ని ఒకేసారి ప్రకటించిన తమిళనాడు

By:  Tupaki Desk   |   5 Sept 2022 4:44 AM
ఆరేళ్ల సినిమా పురస్కారాల్ని ఒకేసారి ప్రకటించిన తమిళనాడు
X
ఒకప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది సినిమాకు సంబంధించిన అవార్డులను ప్రకటించేది. దీనికి సంబంధించిన ప్రకటన కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది.

ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డుల ప్రకటనను.. దాని ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో పిచ్చ లైట్ తీసుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరగటమే కాదు.. ఎవరు ఆ అవార్డుల్ని సొంతం చేసుకుంటారా? అన్న ఆసక్తి వ్యక్తమయ్యేది.

ఇప్పుడు పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలే కానీ.. చిత్ర పరిశ్రమకు అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించాలన్న ఆలోచనే ప్రభుత్వాలకు ఉండదా? అన్నట్లు తయారైంది.

తెలుగు రాష్ట్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా ఉందన్న విషయం తాజా ప్రకటనను చూస్తే అర్థమవుతుంది. 2009 నుంచి ఆ రాష్ట్రంలో ఉత్తమ చలన చిత్రాలకు అవార్డులు ఇచ్చే అలవాటును మానుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం 2009 నుంచి 2014 వరకు అంటే ఒకేసారి ఆరేళ్లకు సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లెక్కన చూస్తే.. గత ఏడాది వరకు అవార్డులకు సంబంధించిన పెండింగ్ పూర్తి చేయాలంటే మరో ఏడేళ్లకు సంబంధించిన పురస్కారాల్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఉత్తమ చిత్రం.. ఉత్తమ నటుడు.. నటి.. దర్శకులుగా ఎవరెవరు నిలిచారన్నది చూస్తే..
2009
ఉత్తమ నటి: పద్మప్రియ
ఉత్తమ దర్శకుడు: వసంత బాలన్
ఉత్తమ సంగీత దర్శకుడు: సుందర్ సి. బాబు
2010
ఉత్తమ చిత్రం: మైనా.. కలవాని.. పుత్రన్
ఉత్తమ నటుడు: విక్రమ్ (రావణన్)
ఉత్తమ నటి: అమలాపాల్
ఉత్తమ దర్శకుడు: ప్రభు సోలమన్
ఉత్తమ సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
2011
ఉత్తమ చిత్రం: వాగై సూడ వా.. దీవ తిరుమగల్.. ఉచితనై మహర్నాల్
ఉత్తమ నటుడు: విమల్
ఉత్తమ నటి: ఇనేయ
ఉత్తమ దర్శకుడు: ఎ.ఎల్. విజయ్
ఉత్తమ సంగీత దర్శకుడు: హరీస్ జయరాజ్
2012
ఉత్తమ చిత్రం: వఝుకు ఎన్ 18/9, సాత్తై, ధోనీ
ఉత్తమ నటుడు: జీవా
ఉత్తమ నటి: లక్ష్మీ మేనన్
ఉత్తమ దర్శకుడు: బాలాజీ శక్తివేల్
ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమ్మాన్
2013
ఉత్తమ చిత్రం: రామానుజన్, తంగమీన్గల్, పన్నైయరుమ్ పాద్మినియమ్
ఉత్తమ నటుడు: ఆర్య
ఉత్తమ నటి: నయనతార (రాజారాణి)
ఉత్తమ దర్శకుడు: రామ్
ఉత్తమ సంగీత దర్శకుడు: రమేశ్ వినయగమ్
2014
ఉత్తమ చిత్రం: కుట్రమ్ కడితల్, గాలీసోడా, నిమిరిందు
ఉత్తమ నటుడు: సిద్ధార్థ్
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్
ఉత్తమ దర్శకుడు: రాఘవన్
- ప్రత్యేక పురస్కారం: సేతుపతి, సమంత




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.