Begin typing your search above and press return to search.
టీవీ సీరియల్స్ షూటింగ్స్ సజావుగా సాగేనా...?
By: Tupaki Desk | 20 Jun 2020 11:30 PM GMTకరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా సినిమా మరియు టీవీ సీరియల్స్ షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో టీవీ సీరియల్స్ షూటింగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు సీఎం పళనిస్వామిని కలిసి షూటింగ్స్ అనుమతి సంపాదించారు. దీంతో కొన్ని సీరియల్స్ షోస్ షూటింగ్స్ స్టార్ట్ చేశారు.
అయితే ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల్లో షూటింగ్స్ చేయడం అంత ఈజీ కాదని అర్థం అయిపోయింది. మరోవైపు గతంలో కంటే ఎక్కువగా కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో షూటింగ్స్ పరిస్థితి మళ్ళీ ప్రశ్నర్థకంగా మారింది. దీంతో అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. గత మూడు నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి మరోసారి కంప్లీట్ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ కారణంగా మరోసారి టీవీ సీరియల్స్ షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా షూటింగులకు అనుమతులిస్తూ ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు మినహా మిగతా ఏ సినిమాలు కూడా చిత్రీకరణ స్టార్ట్ చేయలేదు. కాకపోతే కొన్ని సీరియల్స్ మాత్రం పరిమిత నటీనటులతో షూటింగ్స్ స్టార్ట్ చేసాయి. కొంతమంది సీనియర్ నటీనటులు మాత్రం చిత్రీకరణలో పాల్గొనలేమని చెప్పేశారట. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు నెక్స్ట్ వీక్ నుండి సీరియల్స్ ప్రారంభం అవుతున్నాయని ఇప్పటికే అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చేసారు. కానీ పరిస్థితులు చూస్తే షూటింగ్స్ సజావుగా సాగేలా కనిపించడం లేదు. దీంతో తమిళనాడులో లాగే ఇక్కడ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుందేమో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.