Begin typing your search above and press return to search.
తమిళ్ రాకర్స్..కూడా సాటిస్ ఫై అవ్వరా?
By: Tupaki Desk | 19 Aug 2022 12:11 PM GMTతమిళ్ రాకర్స్.. యావత్ దక్షిణాది సినీ ఇండస్ట్రీ వర్గాలని గత కొంత కాలంగా పైరసీ పేరుతో వణికిస్తున్న పేరిది. కొత్త సినిమా విడుదలైందా..? వెంటనే దాన్ని పైరసీ చేసి తమిళ్ రాకర్స్ సైట్ లో పెట్టేస్తూ ఎంతో మంది స్టార్ ప్రొడ్యూసర్స్ కి, మేకర్స్ కి వెన్నులో వణుకు తెప్పించి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు. వీరి ఆగడాల కారణంగా చాలా మంది నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. సినిమా రిలీజ్ అవుతోందంటే మేకర్స్ ని సవాల్ చేసి మరీ ఆ సినిమా రిలీజ్ కు ముందే ఆ్ లైన్ లో రిలీజ్ చేయడం చేసిన ఓ అరాచక పైరసీ భూతం `తమిళ్ రాకర్స్`. ఇదే పేరుతో ఇప్పడు వెబ్ సిరీస్ ని రూపొందించారు తమిళ దర్శకుడు అరివళగన్.
అరుణ్ విజయ్ హీరోగా నటించగా వాణి భోజన్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఆగస్టు 19 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ఓ నిర్మాత తమిళ్ రాకర్స్ తన సినిమాని పైరసీ చేయడంతో నష్టాల భారిన పడి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. మరో వైపు యాక్షన్ స్టార్ ఆదిత్య హీరోగా మది (అజగమ్ పెరుమాళ్) అనే నిర్మాత రూ. 300 కోట్లతో `గరుడ` అనే భారీ సినిమా నిర్మిస్తాడు.
ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా తమిళ్ రాకర్స్ ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ని విడుదల చేశారు. పూర్తి సినిమాని విడుదల చేస్తామంటూ బెదిరిస్తారు. దీంతో నిర్మాత పోలీసులని ఆశ్రయిస్తాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీస్ డిపార్ట్ మెంట్ ఈ కేసుని స్పెషల్ ఆఫీసర్ రుద్ర (అరుణ్ విజయ్)కి అప్పగిస్తారు. సైబర్ క్రైమ్ టీమ్ సంధ్య (వాణీ భోజన్) తో కలిసి రుద్ర తమిళ రాకర్స్ ని పట్టుకోవడం కోసం ఏం చేశాడు? వాళ్ల నెట్ వర్క్ ఏంటీ? పైరసీ వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏంటీ?.. అసలు వారి వెనకున్న దెవరు? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
సినిఆ నిర్మాత ఆత్యహత్య చేసుకోవడంతో కథను మొదలు పెట్టిన దర్శకుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ప్రధాన చర్చగా తమిళ్ రాకర్స్ మారిన విధానాన్ని చూపించాడు. పరసీ నేపథ్యం, ఇందుకు సంబంధించిన సీన్ లకంటే ఎక్కువే చూపించాడు. కానీ అసలు కథను పక్కన పెట్టి ఈ కేసుని పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రుద్ర వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టడం.. సినిమా నిర్మాణంలో హీరోల కంటే వారి తండ్రులు వేలు పెట్టడం వంటివి చూపించి ఈ సిరీస్ కాన్సెప్ట్ ని పక్కదారి పట్టించాడు.
పోలీస్ ఆఫీసర్ రుద్ర పాత్రలో అరుణ్ విజయ్ సెటిల్డ్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఇక ఇందులో వాణి భోజన్, ఐశ్వర్యామీనన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు. అజగమ్ పెరుమాళ్, మరిముత్తు, వినోద్ సాగర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వికాస్ సంగీతం ఓకే, బి. రాజశేఖర్ ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కు ప్రధాన బలంగా నిలిచింది. అయితే కథ, కథనం మరింత పక్కాగా వుంటే బాగుండేది. తమిళ్ రాకర్స్ పేరు కు తగ్గట్టుగా పాపులర్ అయ్యేంతగా ఈ సిరీస్ కనిపించలేదు. అక్కడక్కడ తప్ప ఏ విషయంలోనూ పెద్దగా ఆకట్టుకోదు.