Begin typing your search above and press return to search.
పైరసీ మాఫియాపై పోరాడి ఎందరో ఓడారు.. ఇన్నాళ్టికి కరోనాతో చెక్!
By: Tupaki Desk | 21 Oct 2020 6:15 AM GMTఆన్ లైన్ పైరసీ వల్ల వేల కోట్ల నష్టం. దేశీ పరిశ్రమలు సహా హాలీవుడ్ రేంజులో పైరసీ ముఠాలు అడ్డగోలుగా సినిమాల్ని టొరెంటుల్లో లీక్ చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. టెక్నాలజీతో వీళ్ల ఆట కట్టించడం ఇప్పటికీ సాధ్యపడలేదు. ఇక తెలుగు-తమిళ ఇండస్ట్రీలో పైరసీపై అలుపెరగని పోరాటాల గురించి తెలిసినదే. స్టార్ హీరో విశాల్ అయితే ఫేమస్ తమిళ పైరసీ మాఫియా తమిళ్ రాకర్స్ పై గొప్ప పోరాటమే చేశాడు. డేరింగ్ గా వెళ్లి అరెస్టులు చేయించేందుకు ప్రయత్నించాడు. అయినా ఇప్పటికీ తమిళ రాకర్స్ పై పై చేయి సాధించిందేమీ లేదు. ఇలాంటి పైరసీ మాఫియాలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. వీటికి చెక్ పెట్టడమెలాగో తెలీక బుర్రలు పట్టుకుంటున్న సమయంలో కరోనా ఇచ్చిన సొల్యూషన్ మామూలుగా లేదనే చెప్పాలి. కరోనా మహమ్మారీ ఊహించని పిడుగులా ఊడిపడినా ఇది ఆన్ లైన్ పైరసీకి ఒక రకంగా చెక్ పెట్టేసిందనే చెప్పాలి. ఓటీటీ డిజిటల్ ఊపందుకోవడానికి కారణమైన కరోనా ఆ రకంగా పైరసీని నిరోధించగలిగిందనేది ఓ విశ్లేషణ.
పైరసీని నిరోధించే బాధ్యతను ఇప్పుడు ఓటీటీ కార్పొరెట్ దిగ్గజాలు తీసుకోవడం పెద్ద రేంజులోనే వర్కవుటవుతోందని సమాచారం. థియేటర్ యజమానులకు చిత్రనిర్మాతలకు భారీ ఉపశమనం కలిగించే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిర్యాదు చేసిన తర్వాత పైరసీ వెబ్ సైట్ తమిళ రాకర్స్ చివరకు పూర్తిగా నిరోధించబడిందన్న తాజా వార్తా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెబ్ సైట్ ఇప్పుడు పూర్తిగా బ్లాక్ చేసారట. వారు కొత్త సినిమాలను లీక్ చేయడానికి కొత్త డొమైన్ తో వస్తారా అనేది ఇంకా తెలీదు. కొత్తగా విడుదలైన అమెజాన్ ప్రైమ్ అసలు చిత్రాలన్నీ పుతం పుధు కలై.. నిశ్శబ్ధం.. పెంగ్విన్ చిత్రాలు విడుదలైన కొన్ని గంటల తరువాత పైరసీ వెబ్ సైట్ లో లీక్ అయిన తరువాత అమెజాన్ రివెంజ్ మొదలైందట.
తమిళ రాకర్స్ ఒక పబ్లిక్ టొరెంట్ వెబ్‌సైట్ .. ఇది తమిళం- తెలుగు- హిందీ- ఇంగ్లీష్- మలయాళం- కన్నడ .. ఇతర భాషా చిత్రాల పైరేటెడ్ వెర్షన్ లను తమ సైట్ లో లీక్ చేస్తుంది. సైట్ డొమైన్ ఎప్పటికప్పుడు క్రొత్త లింక్ కు మారుతూ ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం.., అమెజాన్ ఇంటర్నేషనల్ పైరసీ సైట్ పై బహుళ డిఎంసిఎ (డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం) కేసులు నమోదు చేసింది. వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్ ద్వారా ఈ ఫిర్యాదులు వారి కొత్త చిత్రాలు సైట్లో లీక్ అయిన తరువాత బయటకు వెల్లడయ్యాయి. ఇప్పుడ, వెబ్‌సైట్ ICANN (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) రిజిస్ట్రీ నుండి తొలగించారని తెలుస్తోంది.
దీంతో మన నిర్మాతలకు ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందనే చెప్పాలి. అయితే వెబ్‌సైట్ బ్లాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. వెబ్ సైట్ చాలాసార్లు బ్లాక్ చేయబడింది. అయితే వారు గతంలో సినిమాలను లీక్ చేయడానికి కొత్త డొమైన్ లతో ముందుకు వచ్చారు. ఈ పైరసీ వెబ్ సైట్ తో దేశవ్యాప్తంగా చిత్రనిర్మాతలు ప్రభావితమవుతున్నా.. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది.