Begin typing your search above and press return to search.
టీజర్: తమిళ రాకర్స్ పైరసీ మాఫియా ఆరాచకాలు
By: Tupaki Desk | 3 July 2022 3:47 PM GMTఎదుట ఉన్నది ఎంతటి వాడైనా తమిళ రాకర్స్ లెక్క చేయరు. వీళ్లకు భయం భక్తి అనేవి లేవు. సినిమా విడుదలైన మార్నింగ్ షోకే తమిళ రాకర్జ్ వెబ్ సైట్ లో లైవ్ చూపిస్తామని బెదిరిస్తారు. విశాల్ లాంటి కొందరు హీరోలు రియల్ హీరోలుగా మారి వెంటాడి వేటాడినా.. పందెం కోడిలా ముందుకు ఉరికినా అస్సలు ఖాతరు చేయరు. తమిళ రాకర్స్ మాఫియా ముందు ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే. తమిళ సినిమా.. తెలుగు సినిమా .. హిందీ సినిమా అనే విభేధం వీళ్లకు అస్సలు లేదు. తమిళ నాడు- ఆంధ్రా- మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ చేపట్టినా ఎవరూ ఏమీ చేయలేరు. ఫస్ట్ డే ఫస్ట్ షో వరల్డ్ ప్రీమియర్ బై తమిళ్ రాకర్స్ అని నేరుగా పోలీసులను సైబర్ క్రైమ్ బ్రాంచీనే బెదిరించేంత సత్తా ఉన్నోళ్లు. బయటికి కనిపించకుండా ధడ పుట్టించడం వీళ్ల ప్రత్యేకత. దటీజ్ తమిళ రాకర్జ్.
ఇది వినేందుకే సినిమా చూసినంత థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే ఇప్పుడు ఇదే కథను ఓటీటీ తెరపైకి తెచ్చేస్తున్నారు. తమిళ్ రాకర్స్ పైరేట్ వెబ్ సైట్ ఈ మధ్యకాలంలో దక్షిణ భారత సినిమాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారింది. సినిమా ఏదైనా కానీ విడుదలైన కొన్ని గంటల తర్వాత తమిళ్ రాకర్స్ లో డౌన్ లోడింగుకి అందుబాటులో ఉంటుంది. కొన్ని సినిమాలు విడుదలకు కొన్ని గంటల ముందే వెబ్ సైట్ లోకి వచ్చేసిన సంద్భాలున్నాయి. తమిళ రాకర్స్ పైరేట్ టీమ్ నెట్ వర్క్ అతి పెద్దది. వరల్డ్ వైడ్ విస్తరించి ఉంది. అందుకే తమిళ్ రాకర్స్ కథాంశంతో ఓ వెబ్ సిరీస్ రూపొందించడం ఉత్కంఠ పెంచుతోంది. తమిళ్ రాకర్జ్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ లో అరుణ్ విజయ్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. వాణీ భోజన్- ఐశ్వర్యా మీనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ ను లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సిరీస్ తోనే ఓటీటీ రంగంలోకి ఏవీఎం సంస్థ ప్రవేశిస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం మెరుపులు మెరిపించింది. పైరసీ వల్ల సినిమా పరిశ్రమ ఎలా నష్టపోతోందో టెన్షన్ ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. తమిళ రాకర్స్ పైరసీ నెట్ వర్క్ నిజంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంది. దానికి సరైన తెర రూపం ఇచ్చారనే భావిస్తున్నారు. ఇలా సినిమా రిలీజ్ కాగానే అలా మొబైల్ లో వెబ్ సైట్లో సినిమాలు చూసేసే మాస్ ని బీటెక్ బాబుల్ని కూడా టీజర్ లో ఒక షాట్ లో చూపించారు. తమిళ్ రాకర్జ్ సోనీ లివ్ లో ప్రీమియర్ కానుంది. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించాల్సి ఉంది. థియేటర్ల నుంచి హెచ్ డి క్వాలిటీ సినిమా ఎలా బయటికి వస్తుంది? అన్న మిస్టరీని తెలుసుకోవాలని ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.