Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హీరోగా దూసుకొస్తున్న తంబీ కమెడియన్
By: Tupaki Desk | 17 Nov 2020 5:30 AM GMTతమిళ ఇండస్ట్రీలో వున్న ఏకైక స్టార్ కమెడియనన్ యోగిబాబు. ప్రస్తుతం కోలీవుడ్ ని ఏలేస్తున్నాడు. ఏ స్టార్ హీరో సినిమా చూసినా ప్రస్తుతం వైరల్ గా వినిపిస్తున్న పేరు యోగిబాబు. అంతగా కోలీవుడ్ లో పాపులర్ అయ్యాడు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కమెడియన్ గా నటిస్తూనే పలు చిత్రాల్లో హీరోగానూ నటిస్తున్నాడు.
తమిళ నాట యోగి క్రేజ్ మామూలుగా లేదు. అతడి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ ద్విభాషా చిత్రంలో యోగి బాబుకి ఆఫర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు- తమిళ భాషల్లో రూపొందనున్న ఈ మూవీ ద్వారా ఈ స్టార్ కమెడియన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే తమిళ డబ్బింగ్ చిత్రాలతో పరిచయమైన యోగిబాబు తొలిసాకి స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకు ల ముందుకు రాబోతున్నాడు.
హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఘోస్ట్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో యోగిబాబుకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కథలు వింటున్న యోగిబాబు త్వరలోనే తన తెలుగు సినిమా గురించి ప్రకటించనున్నాడని తెలిసింది.