Begin typing your search above and press return to search.
వీజే చిత్ర మరణంః జైల్లోనే భర్త హేమంత్.. కోర్టు కీలక తీర్పు..!
By: Tupaki Desk | 17 Feb 2021 8:30 AM GMTతమిళ టీవీ నటి వీజే చిత్ర మరణం ఎంతటి సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ‘పాండ్యన్ స్టోర్’ సీరియల్ ద్వారా అత్యంత పాపులారిటీని సంపాదించుకున్నారు వీజే చిత్ర. ఆమె మరణం తమిళ ప్రేక్షకులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే.. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ.. ఆ తర్వాత భర్త హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు ఏం జరిగిందంటే.. గత డిసెంబర్ 9న చిత్ర ప్రాణాలు కోల్పోయారు. చెన్నై శివారులోని నాజ్రేత్‌పేట్‌లోని ఓ హోటల్‌లో ఉన్న బాత్రూంలో ఉరివేసుకున్న స్థితిలో మరణించి కనిపించారు. అయితే.. తొలుత ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావించారు అందరూ. కానీ.. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. అనేక అనుమానాలు లేవనెత్తారు.
దీంతో.. ఈ కేసును హత్య కోణంలో విచారించారు పోలీసులు. ఈ క్రమంలో భర్త హేమంత్ ను అనుమానితుడిగా భావించిన పోలీసులు.. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో.. గడిచిన రెండు నెలలుగా జైలులోనే ఉంటున్నాడు హేమంత్. అయితే.. పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. కోర్టు తిరస్కరించింది.
గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. 60 రోజుల తర్వాత దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కోర్టు సూచనల మేరకు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హేమంత్‌కు.. మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాగానే హేమంత్ జైలు నుంచి విడుదల కానున్నారు.