Begin typing your search above and press return to search.
యంగ్ స్టార్ హీరో అభిమానులకు బిగ్ బ్యాడ్ న్యూస్
By: Tupaki Desk | 15 Dec 2022 5:30 AM GMTతమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన తమిళ్ యంగ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం హీరోగా మరియు నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ తమిళ సినీ ఇండస్ట్రీలో కాకుండా సౌత్ లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు.
ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నిర్ణయించుకోవడం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. హీరోగా స్టాలిన్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సందిగ్దంలో పడ్డాయి. షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉంది.. కానీ కమిట్ అయ్యి మొదలు కానీ సినిమాలు ప్రారంభించకుండానే పక్కకు పెట్టేయబోతున్నారట.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి స్టాలిన్ మంత్రి వర్గంలో తాజాగా చోటు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందని.. అందుకే ఇప్పటి నుండే రాజకీయంగా మరియు పరిపాలన పరంగా అనుభవం సాధించాల్సిందిగా డీఎంకే పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తండ్రి మరియు పార్టీ సీనియర్ ల యొక్క సూచన మేరకు ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు అనే సమాచారం అందుతోంది. ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా ఈయన నిర్మాణంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి కూడా ఈ కొత్త మంత్రి గారు తప్పుకున్నారట.
ఉదయనిధి స్టాలిన్ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాడట. హీరోగా.. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా ఇన్నాళ్లు కోలీవుడ్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన జూనియర్ స్టాలిన్ ఇక పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవ్వబోతున్నాడు. భవిష్యత్తులో కూడా తమిళ సినిమాల్లో నటించే అవకాశాలు కనిపించడం లేదు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సీఎం లు అయిన చరిత్ర తమిళనాట ఉంది... కనుక ఉదయనిధి స్టాలిన్ కచ్చితంగా తమిళనాట భవిష్యత్తు సీఎం అవుతాడు అంటూ ఆయన అభిమానులతో పాటు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.