Begin typing your search above and press return to search.

అమ్మాయిలు సినిమా ఆఫీస్‌ లకు రాత్రి వెళ్లాల్సిన అవసరం ఏంటీ?

By:  Tupaki Desk   |   17 Oct 2019 10:24 PM IST
అమ్మాయిలు సినిమా ఆఫీస్‌ లకు రాత్రి వెళ్లాల్సిన అవసరం ఏంటీ?
X
టాలీవుడ్‌ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈమద్య కాలంలో పలు విషయాల గురించి యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా తన అభిప్రాయాలను వెళ్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఈయన కాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా ఎంత కాలం అంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో తమ్మారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. అమ్మాయిలు అవకాశాల కోసం ఆఫీస్‌ ల చుట్టు తిరిగినంత కాలం కాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కాస్టింగ్‌ కాల్‌ లేకుండా ఆఫీస్‌ నుండి ఎలాంటి పిలుపు లేకుండానే అమ్మాయిలు సినిమా ఆఫీస్‌ లకు వెళ్లడం అస్సలు కరెక్ట్‌ కాదని తమ్మారెడ్డి అన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో సినిమా ఆఫీస్‌ లకు మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటీ. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్‌ ఇవ్వలేదని మీకు డిమాండ్‌ చేసే అర్హత ఎక్కడిది. కాస్టింగ్‌ కాల్‌ చేసి ఆడిషన్స్‌ నిర్వహించిన తర్వాత ఛాన్స్‌ ఇవ్వకుంటే అడిగే అవకాశం ఉంటుంది కాని వారు పిలవకుండానే మీ అంతట మీరు వెళ్లి నాకు ఆఫర్‌ ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నాడు.

కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో కొందరు అమ్మాయిలను ఆఫీస్‌ లకు పిలుచుకోవడం ఆ తర్వాత వాడుకోవడం తప్పు. కాని కొందరు అమ్మాయిలు మాత్రం ఆఫీస్‌ నుండి పిలుపు రాకుండానే వెళ్తున్నారు. రాత్రి సమయంలో వెళ్తేనే మాకు ఆఫర్లు వస్తాయని.. ఆ సమయంలో వెళ్లడం మాకు అలవాటయ్యిందని కొందరు అంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని తమ్మారెడ్డి అన్నారు. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ గురించి వస్తున్న ఫిర్యాదుల గురించి ఆయన మాట్లాడుతూ కొందరు అమ్మాయిలు తమకు అన్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చినా కేసులు పెట్టినా వారికి న్యాయం జరగడం లేదన్నాడు.