Begin typing your search above and press return to search.
'నేనే చేస్తా.. నేనే పీకుతా అనుకోవడం కరెక్ట్ కాదు'.. కుర్ర హీరోల జోక్యంపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 8 Nov 2022 7:17 AM GMTటాలీవుడ్ లో సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరియు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇటీవల అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ ను హీరోగా తీసేయడానికి గల కారణాలను వివరించారు. షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక తెల్లారుజాముజున క్యాన్సిల్ చేయమని విశ్వక్ మెసేజ్ పెట్టారని.. అప్పటికే రెండు సార్లు అతను కోరడంతో షెడ్యూల్ వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఇది తనతో పాటుగా మొత్తం నా టీమ్ ని అవమానించడమే అని ఆవేదన వ్యక్తం చేసారు.
అలానే అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. కళ్ళు మూసుకొని కాపురం చేయలేనని.. తనకు కమిట్మెంట్ లేదు అనడం సరైంది కాదని.. తన వల్ల ఏ ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడలేదని.. షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని లైట్ బాయ్ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ.. 'అర్జున్ చెప్పిన దాని ప్రకారం సినిమా మొదలు పెట్టే ముందు హీరోలు మనకు ఇష్టం ఉందా లేదా? ఆ ప్రొడ్యూసర్ ఇష్టమా లేదా? హీరోకు ఇష్టమా? డబ్బుల గురించి కానీ.. ఇలా ఎన్ని టర్మ్స్ గురించైనా ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలు పెట్టిన తర్వాత అలాంటివి మాట్లాడడం ఎంత వరకు న్యాయం? అది ధర్మమేనా? అలాంటివి అవసరమేనా? అనే మూడు ప్రశ్నలు గురించి చర్చించాలి.
''NT రామారావు గారు ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. 'అతను ఎన్ని తప్పులు చేస్తున్నా ఒక సీనియర్ దర్శకుడిగా ఎందుకు చెప్పడం లేదు' అని ఒకతను ఎన్టీఆర్ ను ప్రశ్నించారట. దానికి బదులిస్తూ 'బ్రదర్.. అతను తప్పు చేస్తున్నాడని మనకు తెలుసు. ఇప్పుడు మనం సరిచేయడం వల్ల హిట్ అవ్వొచ్చు లేదా ప్లాప్ అవ్వొచ్చు. ప్లాప్ అయితే మనం చేసామని బాధ పడాలి.. హిట్ అయితే డైరెక్టర్ వల్లనే అనుకోని మరో పది మంది బుక్ చేసుకుంటారు. ఇంకో పది ప్లాప్స్ ఇస్తాడు.. ఇంకో పదిమంది నిర్మాతల జీవితాలను నాశనం చేస్తాడు. దాని కంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే అతని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు వచ్చి పనిచేసి వెళ్ళాలి' అని ఎన్టీఆర్ చెప్పారట''
''ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. 75 ఏళ్ళ వజ్రోత్సవం అప్పుడు ఆయన కూడా రిహాషల్స్ కు వచ్చేవారు. అందరు హీరోలకు నేనే టైం అలాట్ చేసే వాడిని. బాలకృష్ణ ఎప్పుడూ చెప్పిన సమయానికే వచ్చేవాడు. ఒకసారి ఆయనకిచ్చిన టైంలో వేరే హీరో రిహాషల్స్ చేస్తున్నాడు. 'సారీ సార్.. లేట్ అవుతోంది' అని అన్నాను. 'సారీ ఎందుకండి.. ఇవాళ కాల్షీట్ ఇచ్చాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ ఉంటాను. మీరు ఇష్టం వచ్చినప్పుడు పిలవండి. నా రిహాషల్స్ నేను చేసుకుంటాను' అని బాలయ్య నాతో అన్నారు. ఎన్టీఆర్ గారి నిబద్ధత కూడా అంతే. మనం ఒప్పుకొని కాల్షీట్ ఇచ్చాం కాబట్టి.. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనేది అనవసరం. వచ్చి మన పని చేసుకువాలి. ఎన్టీఆర్ - బాలకృష్ణ గారే కాదు ఎవరైనా చేయాల్సిన పద్దతి అదే అనుకుంటున్నాను''
''ఈ సినిమా విషయానికొస్తే.. ఒప్పుకున్నారు. కొంతకాలం షూటింగ్ అయింది. కానీ విశ్వక్ షూటింగ్ వద్దు అని చెప్పారు. దీనికి వివరణ కూడా ఇచ్చాడు. 'సినిమా ఆపేయమని.. రాలేనని చెప్పలేదు. ఇవాళ ఒక్కరోజు ఆపండి.. నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత చేద్దాం' అని విశ్వక్ చెప్పాడు. ఒక కథ ఒప్పుకున్నాక నచ్చని విషయాలు ఏముంటాయి? అందులోనూ అర్జున్ కొత్త డైరెక్టర్ కాదు. ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. పోనీ ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ అసలు ఆ సినిమా ఒప్పుకోకుండా ఉండాలి. ఒప్పుకున్నాక అతను ఎలా తీస్తే అలా తీయనివ్వండి. అది కాకుండా మాటలు బాగోలేదు.. పాటలు బాగోలేదు.. తీసే విధానం బాగాలేదు అంటే.. ఇవన్నీ అనవసరమైన విషయాలు కదా. మనకెందుకు?''
''నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ ఇన్వాల్వ్ మెంట్ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్కో ప్రొడ్యూసర్ ఒక్కో డైరెక్టర్ ను తీసుకొస్తారు. ఆ డైరెక్టర్ ఒక కథను తీసుకొచ్చి దానికి న్యాయం చేయాలని చూస్తాడు. వివిధ నిర్మాతలు వివిధ దర్శకులు తీసుకొచ్చినప్పుడు వివిధ రకాల కథలు వస్తాయి.. విభిన్నమైన సినిమాలు వస్తాయి. కానీ హీరోలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం. అన్నిట్లో జోక్యం చేసుకోవడం వల్ల పాటలు మాటలు ఆటలు అన్నీ ఒకేలా ఉంటున్నాయి.. చూడటానికి సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. అందుకే ఆడటం లేదని నేను అనుకుంటున్నాను''
''అందుకే నేను రామారావు గారి ఫార్ములా బెస్ట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఎవరు చేసేది వాళ్ళు చేస్తే కొత్త సినిమాలు వస్తాయి. ప్రతీ సినిమాకు వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. కొత్తగా వచ్చిన కుర్రాళ్లందరూ ప్రతీ దాంట్లోనూ కాలు వేలు పెట్టేసి వాళ్ళ సక్సెస్ అనుకొని.. ఫంక్షన్స్ లో చాలా యారొగెంట్ గా మాట్లాడి మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. ఇది పద్దతి కాదు. ప్రేక్షకులు మనకి డబ్బులిచ్చి సినిమాలు చూస్తారు. వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. రామారావు గారు ఎప్పుడూ ప్రేక్షక దేవుళ్లనే మాట్లాడేవారు''
''అలాంటి వాళ్ళని ఎగతాళి చేస్తానికి.. నేనే చేస్తా.. నేనే పీకుతా.. నేను ఏది చెబితే అది నడుస్తుంది అనే టైపులో కొందమంది హీరోలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ ఉండటం వేరు. యారొగెన్స్ ఉండటం వేరు. నేను బ్రహ్మాండంగా చేశాను.. మీరు కూడా చూడండి.. మెచ్చుకుంటారు అని కాన్ఫిడెంట్ గా చెప్పడం వేరు. నేను చేశాను నువ్వు చూడక చస్తావా? అంటే ఎలా?. మనం ఎప్పుడూ ప్రేక్షకులను ఇరిటేట్ చేయకూడదు. మంచి పాత్రలు చేసి వారిని మెప్పించాలి కానీ.. ఫంక్షన్స్ లో మాటలతో గారడీ చేసేసి మనం చాలా గొప్పోళ్ళం అనుకోని.. ఒక సక్సెస్ రాగానే విర్రవీగడం.. ఇవన్నీ మానేస్తే తప్ప సినిమా ఇండస్ట్రీ బాగుపడదు''
''ఇక్కడ ఒక్క విశ్వక్ సేన్ సంగతే ప్రాబ్లమ్ కాదు ఇక్కడ. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు చాలామంది హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. కానీ చెప్పుకోలేకపోతున్నారు. పుకార్ల గురించి నా స్థాయికి మాట్లాడటం ఇష్టం లేదు కానీ.. నిప్పు లేనిదే పొగ రాదని అంటారు కాబట్టి.. అందులో కొంత నిజం ఉంది. చాలామంది హీరోలు చాలా చేస్తున్నారు. కొన్ని మనకు కనబడుతున్నాయి. వాళ్ళు స్టేజీల మీద ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మాటలు నిజమో అబద్దమో సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూస్తే తెలుస్తుంది కదా. చంపేస్తాం.. పొడిచేస్తాం అంటున్నారు. సినిమా చూస్తే అలా లేదని అర్థమవుతోంది కదా''
''సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇష్టమైన సినిమా చేయండి.. అంతేకాని ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని డిస్టర్బ్ చేయకండి. మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చినాక వాళ్లకు కావాల్సినట్లు తీయనిస్తే.. మీకో డిఫెరెంట్ ఫిలిం అవుతుంది. అంతేకానీ ప్రతీది మీరే చెప్తే అన్నీ ఒకేలా ఉంటాయి. అప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది. రామారావు - నాగేశ్వరరావు - చిరంజీవి - బాలకృష్ణ.. ఇలా అందరికీ ఇన్నేళ్ల కెరీర్ ఉందంటే వాళ్ళు వేరియేషన్ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడొచ్చేవాళ్ళు అన్నీ ఒకే రకంగా చేస్తున్నారు. అది అందరూ ఆలోచించుకోవాలి''
''అర్జున్ గారికి జరిగింది నిజంగా అవమానమే. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు.. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే. అలా ఎవరూ చేయకూడదు. విశ్వక్ ఇప్పటికే తనది తప్పని అనుకుంటే క్షమించమని సారీ చెప్పాడు.. ఈయన క్షమిస్తారో లేదో నాకు తెలియదు. ఇక మీద ఎవరికీ ఇలా చేయొద్దనేది నా ఉద్దేశ్యం. వింటారు అనుకుంటున్నాను. వినకపోతే వాళ్ళిష్టం. నాకేమీ ప్రాబ్లమ్ లేదు'' అని చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.