Begin typing your search above and press return to search.
నీచంగా ఉంటే.. వాళ్ల పిల్లలు ఎందుకుంటారు?
By: Tupaki Desk | 19 April 2018 6:57 AM GMTక్యాస్టింగ్ కౌచ్ మీద జరుగుతున్నరార్దాంతం అంతకంతకూ పెరిగిపోతోంది. సినీనటి శ్రీరెడ్డి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. దాని మీద తన పోరాటం అంటూ.. తనను ఎంతోమంది వాడుకొని అవకాశాలు ఇవ్వలేదంటూ కొందరి పేర్లను చెప్పటం తెలిసిందే. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరిపోయి.. ఇప్పుడు సినిమా పెద్దలు సైతం ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ తరచూ వాదనలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. సినీ పరిశ్రమ అంటే ప్రతి ఒక్కరికీ అలుసైపోయిందని.. నీచంగా మాట్లాడుతున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి ఇండస్ట్రీ చాలా బాగుంటుందన్న ఆయన సినీ పరిశ్రమ కనుక నీచంగా ఉండి ఉంటే మోహన్ బాబు కుమార్తె.. నాగబాబు కుమార్తె.. అక్కినేని నాగేశ్వరరావు మనమరాలు.. రాజమౌళి ఇంట్లోని మహిళలంతా ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
అందరూ మాట్లాడుతున్నట్లు ఇండస్ట్రీ అంత దరిద్రంగా.. ఘోరంగా ఉంటే హీరోలు హీరోయిన్లు ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించారు. వేధింపులకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటూ సూచన చేసిన పవన్ ను శ్రీరెడ్డి ఎందుకు తప్పుపడుతుందో తనకు అర్థం కావటం లేదన్నారు. "మా"కు సంబంధించి అందరూ వేలెత్తి చూపిస్తున్న క్యాష్ కమిటీ పేర్లను రెండుమూడు రోజుల్లో ప్రకటించనున్నట్లుగా తమ్మారెడ్డి చెప్పారు. ఇప్పుడు కానీ ఆ క్యాష్ కమిటీలో పేర్లు రానున్న రోజుల్లో మరెంత రచ్చకు గురయ్యేలా చేస్తాయో?