Begin typing your search above and press return to search.
దిల్ రాజును పంపడానికి వీళ్లెవరు-తమ్మారెడ్డి
By: Tupaki Desk | 19 April 2018 7:52 AM GMTకాస్టింగ్ కౌచ్ గొడవ రోజు రోజుకూ ముదురుతున్న నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను తిట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడాడని అతడిని శ్రీరెడ్డి అంత మాట అందని ఆయన ప్రశ్నించారు. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఏ సమస్య వచ్చినా ముందు పోలీసుల్నే సంప్రదించాలని.. అక్కడ న్యాయం జరగకపోతే ఆ తర్వాత రోడ్డు మీదికి రావాలని తమ్మారెడ్డి అన్నారు. శ్రీరెడ్డితో పాటు మిగతా జూనియర్ ఆర్టిస్టులు కొన్ని రోజులుగా వాడుతున్న భాష.. ఇస్తున్న స్టేట్మెంట్లు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. వీళ్ల వల్ల ఇండస్ట్రీ అంటే అందరికీ లోకువ అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దిల్ రాజు గురించి కూడా వీళ్లు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని.. అసలు పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి.. దిల్ రాజును ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతాం అనడానికి వీళ్లెవరని తమ్మారెడ్డి ప్రశ్నించారు. వీళ్ల వెనుక నిలిచిన మహిళా సంఘాల నేతలతో తనకు మంచి పరిచయం ఉందని.. వాళ్లు చాలా మంచి వాళ్లని.. మంచి పనులు చేశారని.. కానీ వాళ్ల సమక్షంలో శ్రీరెడ్డి తదితరులు వాడిన భాష.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని.. అలాంటి మాటల్ని వాళ్లు ఎలా అననిచ్చారో తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆయనన్నారు. రకుల్ ప్రీత్ ను శ్రీరెడ్డి చెప్పుతో కొడతా అని అందని.. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని.. తన మానాన తాను ఉంటూ తనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని రకుల్ అంటే.. ఆమెను అంతలేసి మాటలు ఎలా అంటుందని తమ్మారెడ్డి ప్రశ్నించారు.