Begin typing your search above and press return to search.
చిరు.. బాలయ్య.. పవన్.. అలా చేస్తే తప్పేంటి?
By: Tupaki Desk | 15 March 2017 7:58 AM GMTటాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాగా వేగం పుంజుకున్నారు. ఒకప్పట్లా ఏడాదికో సినిమా అంటూ నాన్చట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాను లైన్లో పెట్టేస్తూ.. ఏడాదికి కనీసం రెండు రిలీజులుండేలా చూసుకుంటున్నారు. ఒకప్పుడు తాపీగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం స్పీడ్ పెంచారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ అయిన వెంటనే తన తర్వాతి సినిమా పనుల్ని వేగవంతం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన తన తర్వాతి సినిమా చేయనున్నారు. దాని తర్వాత బోయపాటితో సినిమాకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు బాలయ్య ముందు ఒకటికి మూడు ప్రాజెక్టులున్నాయి. పవన్ కూడా రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టాడు.
ఐతే ఈ ముగ్గురూ 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వేగం పెంచారని.. తలో మూడు సినిమాలు చేసి రాజకీయాల్లో బిజీ అయిపోతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయమై టాలీవుడ్ పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ హీరోలు ముగ్గురూ వేగంగా సినిమాలు చేస్తే తప్పేంటని.. ఈ విషయంలో ప్రతికూల ప్రచారం సరికాదని ఆయన అన్నారు. చిరు.. బాలయ్య గతంలోనూ ఏడాదికి రెండు మూడు చొప్పున సినిమాలు చేశారని.. అప్పుడు మాట్లాడని వాళ్లు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని తమ్మారెడ్డి ప్రశ్నించారు. సినిమా వాళ్లు రాజకీయాలపై దృష్టిపెడితే తప్పేమీ లేదని.. రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమాలు చేయొచ్చని.. రాజకీయాల్లో విఫలమై తిరిగొచ్చాక కూడా సినిమాల్లో ఒక వెలుగు వెలగొచ్చని.. ఇందులో విమర్శించాల్సిన విషయాలేమీ లేవని తమ్మారెడ్డి అన్నారు. ఇక తెలుగు సినిమాల తీరుపై తమ్మారెడ్డి స్పందిస్తూ.. గతంతో పోలిస్తే మేకింగ్ పరంగా మార్పులు కనిపిస్తున్నాయని.. కానీ ఈ మార్పు మరింతగా రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/