Begin typing your search above and press return to search.
'మా' గొడవ మంచికే జరిగిందట
By: Tupaki Desk | 3 Jan 2020 1:29 PM GMTమా లో ఉన్న విభేదాలు ఇన్ని రోజులు నివురు గప్పిన నిప్పులా ఉన్న విషయం తెల్సిందే. బాహాటంగా విమర్శలు చేయకున్నా అందరికి మా లో విభేదాలు ఉన్న విషయం తెల్సిందే. అయితే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం అంతా బాగానే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాని ఇటీవల జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి.. కృష్ణంరాజు వంటి ప్రముఖుల సమక్షంలో రాజశేఖర్ మా లో గొడవలు ఉన్నాయని వాటిని కప్పి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాహాటంగానే మాట్లాడాడు.
ఆ మాటలకు చిరంజీవి.. కృష్ణంరాజు మరియు మోహన్ బాబులు అసహనం వ్యక్తం చేయడంతో పాటు రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఇదే సమయంలో రాజశేఖర్ మరియు జీవితలు మా పదవులకు రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన రసాబాసా మంచికే జరిగిందని అన్నాడు.
ఆధిపత్యం కోసం మా లో గొడవలు జరుగుతున్న విషయం అందరికి తెల్సిందే. ఇప్పుడు పెద్దల సమక్షంలో గొడవలు జరగడంతో మా లో ఉన్న విభేదాలకు పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపై అయినా చిరంజీవి మరియు పెద్దలు మా ను ముందుండి నడిపించాలని తమ్మారెడ్డి కోరాడు. ఇకపై అయినా మా లో ఈ విభేదాలు సర్దుమణిగి అంతా బాగుండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. తమ్మారెడ్డి మాత్రమే కాకుండా ఇంకా పలువురు కూడా ఈ గొడవను మంచికే జరిగిందంటున్నారు. ఇకపై అయినా మా లో గొడవలు జరగకుండా ఉంటాయని మా సభ్యులు అభిప్రాయ పడుతున్నారు.