Begin typing your search above and press return to search.
బాలయ్య ది గ్రేట్ అన్న తమ్మారెడ్డి
By: Tupaki Desk | 19 May 2018 7:10 AM GMTఎవరినైనా విమర్శిస్తారు.. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ముఖస్తుతి కోసం ఆయన ఎవరినీ పొగడరు. ఆయన కమెడియన్ ఆలీ నిర్వహించే ఓ టీవీ ప్రోగ్రాంలో భాగంగా టాలీవుడ్ బడా స్టార్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి.. నందమూరి బాలకృష్ణను ఈ కార్యక్రమంలో తెగ పొగిడేయడం విశేషం. ముందు చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయన మామూలు హీరోగా ఉన్నపుడు తమ మధ్య మంచి స్నేహం ఉండేదని.. తామిద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్లమని అన్నాడు. ఐతే చిరు మెగాస్టార్ అయ్యాక మాత్రం తమ మధ్య దూరం పెరిగిందని చెప్పాడు తమ్మారెడ్డి.
ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. నిజానికి ఆయనతో తనకు పరిచయం తక్కువన్నాడు. ఐతే తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించినపుడు బాలయ్య అంటే ఏంటో తనకు అర్థమైందన్నాడు. ఆ వేడుకల కమిటీ బాధ్యతలు తనకు అప్పగించారని.. హీరోలతో రిహార్సల్స్ అన్నీ తనే చేయించేవాడినని.. ఐతే అప్పుడు చాలా మంది హీరోలు రిహార్సల్స్ టైంలో అతి చేశారని చెప్పాడు. ఐతే బాలయ్య మాత్రం చాలా హుందాగా ప్రవర్తించాడన్నాడు. ఉదయమే వచ్చి కూర్చునేవాడని.. ఎవరైనా స్టేజ్ మీద సాధన చేస్తున్నా అభ్యంతర పెట్టేవాడు కాదని.. ఈ విషయమై సర్దిచెప్పడానికి వెళ్తే.. ‘మీరు పిలిచారు వచ్చాను. నా కాల్ షీట్ సాయంత్రం వరకు. మీరు ఎప్పుడు ఏది చెబితే అది చేస్తా’ అనేవాడని.. అతడి ఆయన గొప్పదనమని తమ్మారెడ్డి చెప్పాడు. అంత పెద్ద హీరో అలా ఉంటాడని తాను అనుకోలేదని.. బాలయ్యకు కోపం ఎక్కువని ఏదేదో విన్నానని.. ఆయన మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్తించాడని.. అప్పటి నుంచి తనకు ఆయనపై గౌరవం పెరిగిందని తమ్మారెడ్డి తెలిపారు.