Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాత
By: Tupaki Desk | 18 Sep 2018 7:59 AM GMTమెగాస్టార్ చిరంజీవితో `కోతలరాయుడు` సినిమా తీశారు సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అంతకుముందు నుంచే మెగాస్టార్ తో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన పలు చిత్రాల ప్రమోషన్స్ కి పిలవకుండానే మెగాస్టార్ వచ్చేవారట. నాడు మెగాస్టార్ ఎలా ఉండేవారో - నేడు మెగాస్టార్ స్థాయి ఏంటో ఆయన తనదైన శైలిలో చెప్పారు. 40 ఏళ్లుగా ఆయన చెక్కు చెదరని మెగాస్టార్ గా ఎందుకున్నారో గుట్టు విప్పారు తమ్మారెడ్డి.
ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -40 ఏళ్ల క్రితం `మొగుడు కావాలి` సినిమా తీశాను. ఆ సినిమా లాంచ్ కోసం పిలవగానే వచ్చారు మెగాస్టార్. నాన్న మీద కోపంతో చిరుకి ఫోన్ చేస్తే నాకు సాయానికొచ్చారు అప్పుడు. అది వేరే కథ. అప్పుడు కూడా సినిమాకి సంబంధించి ఏ వివరం అడగకుండా తను నా కోసం వచ్చారు. చిరంజీవితో నా అనుబంధం వేరు. ఆయనతో రెండు సినిమాలు చేశాను. అసలు డబ్బులే ఇవ్వలేదు తనకి. తర్వాత చాలా కాలం సినిమాల పరంగా మేం కలుసుకోలేదు. ఆ తర్వాత నేను దర్శకుడిని అవుతూ `అలజడి` సినిమా చేస్తే నేను పిలవకుండానే ఆయన వచ్చి పార్టీ ఇచ్చారు`. చరిత చిత్ర` తొలి టీవీ షో ఓపెనింగుకి వచ్చి సాయమయ్యారు మా చిరంజీవి.
చిరంజీవి గురించి చాలా చెప్పాలి. చిరంజీవికి సినిమా అంటే చాలా పిచ్చి. నా సినిమా కోతలరాయుడు కి డ్యాన్స్ మాష్టర్లు - ఫైట్ మాష్టర్లు లేరు. ఆయనే ఫైట్ మాస్టర్. నేను నిర్మించిన `మొగుడు కావాలి` టైమ్ లో 47రోజుల ఫారిన్ షెడ్యూల్ ఉంది. ప్యారిస్ వెళ్లాలి. ఆ ముందు రోజు నైట్ షూట్ పూర్తి చేసి - వెళ్లాలి. రాత్రి షూటింగ్ ... మోకాళ్లకు నీ క్యాప్ కావాలి... ఆ సన్నివేశాలు అలాంటివి. వేరొక హీరో అయితే నీక్యాప్ మొహాన కొట్టేవాడే. కానీ చిరు అలా కాదు. ఆ రాత్రి షూట్ పూర్తి చేసి - స్పిరిట్ చూపించారు. నా కాలు పోయినా ఫర్వాలేదు సినిమా పూర్తి చేయాలి. షెడ్యూల్స్ వేస్ట్ కాకూడదని అన్నారు. 40 ఏళ్ల నుంచి ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారు అంటే ఇంత కష్టపడ్డారు కాబట్టే. అప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు కూడా మరోసారి మేం సినిమా రిలీజ్ చేస్తుంటే ప్రచారానికి వచ్చారు. యువన్ శంకర్ రాజా తొలి సారి నిర్మాతగా రూపొందించిన `ప్యార్ ప్రేమ కాదల్` చిత్రాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. బాగా నచ్చి రిలీజ్ చేస్తున్నాం.. అని తెలిపారు తమ్మారెడ్డి.