Begin typing your search above and press return to search.
తమ్మారెడ్డి తిట్టింది ఎవరిని?
By: Tupaki Desk | 6 May 2018 8:28 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎవరి మీదైనా విమర్శలు చేయగలరు. ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల మీద ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పరిశ్రమ వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దాసరి ఉన్నపుడు ఆయన ప్రాపకం కోసం పోటీ పడిన వాళ్లు.. ఇప్పుడు కనిపించడం లేదని.. ఆ నీచులు ఇలాంటి కార్యక్రమాలకు రాకపోవడం మంచిదే అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. అలాంటి వ్యక్తులపై గతంలో దాసరికి.. తనకు మధ్య జరిగిన సంభాషణను కూడా ఆయన బయటపెట్టారు.
అప్పట్లో దాసరిని కలవడానికి తమలాంటి వాళ్లు వెళ్తే.. తమను తోసుకుని వాళ్లు ముందుకెళ్లేవాళ్లని.. అలాంటి వాళ్లు ఇప్పుడు దాసరి జయంతి వేడుకలకు రాలేదని తమ్మారెడ్డి అన్నారు. ఒకసారి దాసరిని కలిసినపుడు.. ఇది చాలా నీచమైన ఇండస్ట్రీ అని.. ఇక్కడ చాలా మంది నీచులున్నారని.. వీళ్లతో మనకు ఎందుకు సార్ వదిలేయండి అని తాను చెప్పినట్లు తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. దాసరితో పని పూర్తయిన వెంటనే ఆ వ్యక్తులు ఆయన్నే బూతులు తిట్టేవారని.. ఇదే విషయం దాసరికి చెబితే.. ఎవరెవరు ఏలాంటి నాటకాలు ఆడుతున్నారో అన్నీ తనకు తెలుసు.. ఐతే ఇండస్ట్రీలో మనలాగా ప్రశ్నించేవాళ్లు ఉన్నారు కాబట్టే అందరూ భయపడుతున్నారని.. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుందని దాసరి అన్నట్లు తమ్మారెడ్డి వెల్లడించారు. దాసరి వెళ్లిపోయాక ఆయన అన్నట్లుగానే ఇండస్ట్రీ కకావికలం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను నీచులుగా పేర్కొంటున్న ఆ వ్యక్తులు ఇప్పుడు దాసరి జయంతి వేడుకలకు వస్తారని తాను అనుకోలేదని.. వాళ్లు రాకపోవడమే మంచిదని.. ఎవరికైతే దాసరిపై ప్రేమ మమకారాలు ఉన్నాయో వాళ్లే వచ్చారని తమ్మారెడ్డి అన్నారు. మరి తమ్మారెడ్డి నీచులుగా పేర్కొన్న ఆ వ్యక్తులు ఎవరన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. దాసరి బతికి ఉండగా ఆయన చుట్టూ ఉండి ఇప్పుడు ఈ వేడుకలో పాల్గొనని వ్యక్తులు ఎవరబ్బా?