Begin typing your search above and press return to search.

తనికెళ్ళ వారూ.. ప్రొగ తాగమంటారా??

By:  Tupaki Desk   |   10 Jun 2017 7:12 AM GMT
తనికెళ్ళ వారూ.. ప్రొగ తాగమంటారా??
X
రియల్ లైఫ్‌ లో నిజంగానే సిగరెట్లు తాగే చాలామంది టాప్ హీరోలు సైతం.. సినిమాల్లో మాత్రం.. సిగరెట్ కాల్చకండి.. పోతారు.. అంటూ వార్నింగ్ సైన్లు చదువుతూనే ఉంటారు. ఇకపోతే ప్రతీ సినిమాకూ ముందు రాహుల్ ద్రావిడ్ చేసిన 'నో టు టొబాకో' యాడ్లు తప్పనిసరిగా వేయాలి. ఇవన్నీ వేసినా కూడా.. సిగరెట్టు మానేయమంటున్న గవర్నమెంటు ఎలాగైతే సిగరెట్లను బ్యాన్ చేయదో.. సిగరెట్ తాగొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చే సెలబ్రిటీలు కూడా.. చాటుగా తాగమనే ఎంకరేజ్ చేస్తున్నారు.

నిన్న విడుదలైన 'ఆమీ తూమీ' సినిమా మొదలయ్యే ముందు కూడా.. సిగరెట్టు కాల్చకండి అంటూ యాజిటీజ్ గా చెప్పేశారు. కాకపోతే ఇంటర్వెల్ సమయంలో మాత్రం ప్రముఖ రైటర్ కమ్ నటుడు తనికెళ్ళ భరణి పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ''ఇంటర్వెల్ బ్యాంగ్ ఎవడన్నా ఇచ్చాడా? బ్రేక్ తీసుకోండి. కాఫీలు టీలు సుస్సూలు ఉఫ్ఫూలు కానిచ్చేయండి'' అంటూ చేతితో సైగ చేసి మరీ సిగరెట్ కాల్చుకుని రమ్మని కెమెరాని చూస్తూ చెప్పేస్తాడు. అంటే ఇన్ డైరక్టుగా వారు సినిమా మొదటిలో వేసిన 'నో స్మోకింగ్' వార్నింగ్ ను వారే కాదని చెప్పడం కదా. అలాంటప్పుడు ఇక వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? అయినా ఇలాంటి డైలాగ్ చెప్పడానికి తనికెళ్ళవారు ఎలా ఒప్పుకున్నారో ఏంటో.

ఇకపోతే ఆమీ తూమీ వంటి సినిమాలో క్లీన్ కామెడీ తీశాం అన్నారు కాని.. అక్కడ డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు ఇలాంటి పొగత్రాగమనే కామెడీ కూడా చాలానే ఉంది. అది సంగతి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/