Begin typing your search above and press return to search.
రాజకీయాల్లో యువహీరోల జోరు
By: Tupaki Desk | 9 March 2019 4:34 PM GMTయంగ్ హీరోలు తనీష్ - రాజ్ తరుణ్ భవిష్యత్ సంగతేంటి? గత కొంతకాలంగా ఈ ఇద్దరు హీరోల కెరీర్ సన్నివేశం తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతూ .. కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఆ ఇద్దరూ రాజకీయాల్లోకి రావడంపై టాలీవుడ్ వర్గాలు సహా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ వీళ్లు రాజకీయాల్లో ప్రవేశించడమేంటి .. ఏ పార్టీ తరపున అంటారా? .. ఈ ఇద్దరు యువహీరోలు ప్రస్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసీ సభ్యులుగా యాక్టివ్ గా సేవలు అందించే ఉద్ధేశంతో పోటీకి దూసుకొచ్చారు.
తనీష్ కాస్త రాజ్ తరుణ్ కంటే సీనియర్ హీరో. అందువల్ల అతడు చాలానే యాక్టివ్ గా ఉన్నాడు. మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్ తరపున ఆ ఇద్దరూ ప్రచారానికి తిరిగేస్తున్నారు. ఆర్టిస్టులందరినీ కలుస్తూ తమకు ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? అంటే.. మూవీ ఆర్టిస్టుల సంఘం తరపున ఎంతో ముందు చూపుతో ఆ ఇద్దరినీ బరిలో దించారు శివాజీ రాజా- శ్రీకాంత్ బృందం. `మా`కి యువరక్తం అవసరం. వీళ్లకు ఇప్పటి నుంచే మా అసోసియేషన్ వ్యవహారాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉంటే భవిష్యత్ లో మరిన్ని మంచి పనులు చేసేందుకు వీలుంటుందని.. అందుకే ఆ ఇద్దరినీ తెరపైకి తెచ్చామని ఇటీవల శివాజీ రాజా బృందం తెలిపింది.
తాము కూడా కేవలం హీరోలుగా ఉండడమే కాదు.. ఆర్టిస్టుల కష్టనష్టాలేంటో తెలుసుకుంటే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందని భావించి మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆ ఇద్దరూ తెలిపారు. ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. దాదాపు 55 మంది కంటెస్టెంట్స్ 25 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. 785 ఓట్లు మా అసోసియేషన్ లో ఉన్నాయి. పోటీ హోరా హోరీగా ఉండనుంది. మా ప్యానెల్ అధ్యక్షుడు శివాజీ రాజా తలపెట్టిన పథకాలు బావున్నాయి. విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మితో పాటు వృద్ధాశ్రమ నిర్మాణం ఆలోచన బావుంది. అందుకే ఈ ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నామని వెల్లడించారు.
మరో కోణాన్ని పరిశీలిస్తే.. మా అసోసియేషన్ లో చేరాకే నటకిరీటి రాజేంద్రప్రసాద్ కానీ - శివాజీ రాజా కానీ - నరేష్ కానీ కెరీర్ పరంగానూ పూర్తి బిజీ అయ్యారు. సీనియర్ల బాటలోనే యువహీరోలు రాజ్ తరుణ్ - తనీష్ ఈ ఎన్నికల్లో గెలిచి కెరీర్ పరంగానూ గేమ్ ఛేంజ్ చేసుకునేందుకు ట్రై చేస్తారేమో చూడాలి. కొన్ని పదవులు బరువు బాధ్యతలతో పాటు అవకాశాల్ని తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు. తనీష్, రాజ్ తరణ్ ఆ కోణంలోనూ సక్సెసవుతారేమో!! అలాగే మెగా సపోర్ట్ ఈ యువహీరోలకు పుష్కలంగా దొరికే వీలుంది.