Begin typing your search above and press return to search.
కృష్ణవంశీకి ఇంకో ఆప్షనే దొరకలేదా?
By: Tupaki Desk | 6 July 2017 12:31 PM GMTకృష్ణవంశీ ఫామ్ కోల్పోయి ఉండొచ్చు. గత దశాబ్ద కాలంలో ఆయన సినిమాలేవీ ఆడకపోయి ఉండొచ్చు. కానీ దర్శకుడిగా కృష్ణవంశీ విలువ ఏమీ కోల్పోలేదు. ఇప్పటికీ ఆయనతో నటించడానికి తహతహలాడే నటీనటులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక్కసారి ఆయనతో నటిస్తే జన్మ ధన్యం అని వీళ్లందరూ అనుకుంటారు. ఆయన కోరితే సినిమా చేయడానికి ఎందరో ముందుకొస్తారు. అందులోనూ కృష్ణవంశీ సినిమాలో విలన్ పాత్ర అంటే ఇంకా ప్రత్యేకం కాబట్టి ఆయన ఎవరినైనా నెగెటివ్ రోల్ కోసం అడిగితే.. మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు. కానీ హీరోగా స్ట్రగులవుతూ.. సినీ కెరీర్ భవితవ్యమేంటో తెలియకుండా ఇబ్బంది పడుతున్న తనీష్ ‘నక్షత్రం’లో విలన్ పాత్ర కోసం అడిగితే తటపటాయించాడట. అతను ఏ విషయం తేల్చకపోయినా కృష్ణవంశీ మాత్రం మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా అతడి కోసమే వెయిట్ చేశాడట. ‘నక్షత్రం’ ఆడియో వేడుకలో తనీషే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు.
గతంలో ఎప్పుడో ఒకసారి కృష్ణవంశీని కలిసి మీ సినిమాలో చిన్న పాత్రయినా ఇవ్వమని అడిగానని.. చూద్దాం అన్నారని.. తర్వాత చాలా కాలానికి పిలిచిన ‘నక్షత్రం’లో నెగెటివ్ రోల్ గురించి చెప్పారని.. కానీ పలు విధాలుగా ఆలోచించానని.. ఆయనకు ఏ విషయం చెప్పలేదని తనీష్ వెల్లడించాడు. మధ్యలో తన తండ్రి చనిపోవడం.. వ్యక్తిగత జీవితంలో ఇంకొన్ని ఇబ్బందులతో దిక్కు తోచని స్థితిలో పడిపోయానని.. అలాంటి టైంలో కృష్ణవంశీ మళ్లీ పిలిచి ఈ పాత్ర గురించి చెప్పారన్నాడు. ‘నేను నిన్ను నమ్ముతున్నా.. నువ్వు నన్ను నమ్మవా’ అని కృష్ణవంశీ అడిగినట్లు తనీష్ వెల్లడించాడు. అది తన జీవితంలో అది పెద్ద మాట అని.. ఆయనలా అనగానే వెంటనే ఈ పాత్రకు ఒప్పేసుకున్నానని తనీష్ వెల్లడించాడు. మరి తనీష్ లో అంత ప్రత్యేక ప్రతిభను కృష్ణవంశీ ఏం చూశాడో ఏమో కానీ.. మామూలుగా పెద్ద స్టార్లను కూడా లెక్క పెట్టనట్లుగా వ్యవహరించే ఆయన తనీష్ కోసం అలా వెయిట్ చేసి.. మళ్లీ మళ్లీ విలన్ పాత్రం కోసం అడగడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే.