Begin typing your search above and press return to search.

అనవసరంగా కంగారుపడుతున్నావ్ కుర్రాడా!!

By:  Tupaki Desk   |   1 Aug 2017 5:20 PM GMT
అనవసరంగా కంగారుపడుతున్నావ్ కుర్రాడా!!
X
మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఈవారం విడుదల కాబోతున్న 'నక్షత్రం' సినిమాలో యంగ్ హీరో తనిష్‌ నెగెటివ్ రోల్ అంటే నెగెటివ్ రోల్ కాదు.. ఏకంగా డ్రగ్స్ కు భానిసైన యువకుడి రోల్ పోషిస్తున్నాడు. ఒక ప్రక్కన నిజంగానే రియల్ లైఫ్‌ లోనే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నా తనీష్‌.. ఇప్పుడు సినిమాలో కూడా అదే రోల్ చేయడం చాలా యాక్సిడెంటల్ గా షాకింగుగా ఉంది. ఇప్పుడు దీని గురించే తనీష్‌ కూడా కంగారుపడుతున్నాడట.

నిజానికి మొన్నటివరకు తొలిసారిగా నెగెటివ్ రోల్ పోషిస్తున్నాను అనే కుతూహలంలో చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాడు తనీష్‌. కాని ఎప్పుడైతే సడన్ గా డ్రగ్స్ విషయంలో ఒక విచారణకు రావల్సిందిగా ఎక్సయిజ్ శాఖ వారు నోటీసులు పంపారో అప్పుడే మనోడికి భయం పుట్టిందట. అసలే సినిమాలో డ్రగ్స్ తీసుకునే పాత్రను చాలా ఆసక్తికరంగా పోషించడంతో.. ఇప్పుడు నిజంగానే మనోడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టే అంత నిజాయితీగా ఈ పాత్రను చేశాడని అందరూ అనుకుంటారేమోనని ఫీలవుతున్నాడట.

సర్లేండి ఇది మరీ విడ్డూరం. నిజ జీవితంలో తాగని ఎంతోమంది సెలబ్రిటీలు వెండితెరపై తాగుడుకు భానిసైన క్యారక్టర్లు చేశారు. అలాగే వారిని అందరూ తాగుబోతులు అనుకుంటారా ఏంటి? ఇది కూడా అంతే. డ్రగ్స్ తీసుకునే రోల్ చేయాలంటే అలా చేస్తున్న వారి వీడియోలు చూసి.. వారి గురించి చదివి.. అద్భుతంగా పరిణితి చెందిన నటన చూపించవచ్చు. కంగారుపడకులే తనీష్‌!!