Begin typing your search above and press return to search.
కుర్ర హీరో పంజా విసురుతాడట
By: Tupaki Desk | 25 Aug 2017 4:30 AM GMTయంగ్ హీరో తనీష్ పేరు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వివాదంలోనే ఎక్కువగా వినిపించింది. అయితే.. అదే సమయంలో తను నటించిన 'ప్రేమిక' చిత్రానికి ప్రమోషన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఆ గొడవ అంతా సద్దు మణిగిన తర్వాత.. ప్రేమిక ట్రైలర్ తో ఆకట్టుకునేందుకు తనీష్ ప్రయత్నిస్తున్నాడు.
మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ప్రేమిక మూవీని.. పక్కా పల్లెటూరి నేపథ్యంతో తీసిన మూవీ అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా చెప్పేశారు మేకర్స్. అలాగే ట్రైలర్ కట్ చేసిన విధానం చూసిినా.. మూవీలో లవ్ ఎపిసోడ్స్ కంటే యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే సంగతి అర్ధమవుతోంది. పైగా ప్రేమ కంటే ముందే.. విలన్ తో వైరం ఉన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేశారు. గ్రామీణ నేపథ్యంతో.. ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అనే థీమ్ తో సినిమాను తెరకెక్కించారనే సంగతి అర్ధమవుతుంది. సింహానికి ఎదురొస్తున్నావ్ అంటూ విలన్ చెప్పిన డైలాగ్ కు.. పంజా విసరడం మాకూ తెలుసు అంటూ తనీష్ చెప్పిన డైలాగ్ బాగానే పేలింది.
అయితే.. ప్రేమిక అంటూ లవ్ స్టోరీ అనే ఇండికేషన్ ఇచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతి యుగల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ట్రైలర్ లో ఆమెకు సంబంధించిన ఫ్రేమ్స్ బాగా తక్కువగా ఉన్నాయని అనిపించక మానదు. అయితే.. ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ లకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో.. ఇలాంటి మాస్ మసాలా చిత్రంతో తనీష్ బాగా ధైర్యం చేస్తున్నాడనే చెప్పాలి.