Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోయిన్ అదిరే అందాల షో.. వైరల్ పిక్!

By:  Tupaki Desk   |   29 May 2021 3:30 AM GMT
ఎన్టీఆర్ హీరోయిన్ అదిరే అందాల షో.. వైరల్ పిక్!
X
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీస్ ఎంతమంది ఉన్నా బాలీవుడ్ నుండి వచ్చే హీరోయిన్లకు క్రేజ్ వేరేలా ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో తక్కువ సినిమాలు చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అందాలను ఆరబోసి పోతుంటారు. అలాంటి ముంబై భామలలో ఒకరు తనీషా ముఖర్జీ. ఈ వయ్యారి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మడు తెలుగులో ఒకేఒక సినిమా చేసింది. అదికూడా సెకండ్ హీరోయిన్ గా అయ్యేసరికి పెద్దగా ఫేమ్ లోకి రాలేదు. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలో తనీషా సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తమిళంలో ఉన్నాలే ఉన్నాలే సినిమా చేసి బాలీవుడ్ వైపు అడుగులేసింది. నిజానికి తనీషా ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన కాజోల్ సోదరి. నిజంగానే కాజోల్ కు స్వయానా తోడబుట్టిన చిన్న చెల్లెలు ఈ వయ్యారి.

అయితే సినిమాలు తక్కువే చేసింది. తనీషా - కాజోల్ తల్లి తనూజా ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్. అలాగే తండ్రి షోము ముఖర్జీ ఒకప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్. మొత్తానికి ఫిల్మ్ బాక్గ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో తనీషాకు సినీ అరంగేట్రం అనేది పెద్దగా సమస్య కాలేదు. కానీ అమ్మడు ఎందుకోగాని సినీ కెరీర్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలు తక్కువ చేసి గ్లామరస్ ఫోటోషూట్స్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిపోయింది తనీషా. ఈ వయ్యారికి ముఖ్యంగా బీచ్ లో బికినీ ఫోటోషూట్స్ ద్వారా హాట్ బాంబుగా కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాలుగు పదుల వయసు మీదపడినా అమ్మడు గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా వయ్యారి పోస్ట్ చేసిన ఓ హాట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదిరే పోజులో ఎల్లో డ్రెస్ ధరించిన తనీషా.. ఎద అందాలు బయటపడేలా వి షేప్ కట్ అంచు కలిగిన డ్రెస్ ధరించి సోషల్ మీడియాను ఉడికిస్తోంది. చూడటానికి కాస్త ముదురుగానే కనిపిస్తుంది కానీ అందాలు చూస్తే మతులు పోతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు.