Begin typing your search above and press return to search.
రేప్ కల్చర్.. ఆఖరికి కుక్కలు మేకలపై కూడా!
By: Tupaki Desk | 6 Aug 2019 10:39 AM GMTభారత దేశంలో #మీటూ ఉద్యమంలో ప్రధానంగా వినిపించిన పేరు తనుశ్రీ దత్తా. మాజీ మిస్ ఇండియా.. బాలీవుడ్ హీరోయిన్ అయిన తనుశ్రీ సీనియర్ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఆ మీటూ ఆరోపణలు.. వాటిపై నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా భారత దేశంలో పెరుగున్న అత్యాచారాలపై తీవ్రంగా స్పందించింది.
"ఇండియాను అత్యాచారం అనే అంటు వ్యాధి పట్టి పీడిస్తోంది. ఉన్నావో రేప్ కేసు.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈ విషయంలో మనకు ప్రస్తుత పరిస్థితిపై హెచ్చరికలు అందిస్తున్నాయి. భారతదేశంలో మెజారిటీ వార్తలు చూస్తే స్త్రీలు పిల్లలపై అత్యాచారాలు.. హత్యలు.. శిశువులను పురిటిలోనే హతమార్చడం.. కట్నం కేసులు.. రేప్ తర్వాత పాశవికంగా హతమార్చడం లాంటివి ... ఆఖరికి మేకలు.. కుక్కలపై అత్యాచారాలు ఇవీ మన వార్తలు. ఇవన్నీ మన సంస్కారి కల్చర్ అని చెప్పుకునే భారతదేశంలోనే జరుగుతున్నాయి.:"
"కానీ మనం మాత్రం మన దేశం సంప్రదాలయాలకు.. విలువలకు పుట్టినిల్లని చెప్పుకుంటూ విదేశాలలో బికినీలు వేసుకునే వారిపై కామెంట్లు చేస్తూ తీర్పులు ఇస్తుంటాం. కానీ ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో మహిళలు నగ్నంగా బీచుల్లో పడుకుంటారు.. అక్కడ ఈవ్ టీజింగ్ జరగదు.. రేపులు జరగడం లేదు. మరి అలాంటప్పుడు మీరు సంస్కారం ఉన్న జాతి ఎలా అవుతారు? ఎలాంటి దుస్తులు వేసుకున్నారనే దాన్ని బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయనే మైండ్ సెట్ ను ముందు మార్చుకోవాలి" అంటూ తనుశ్రీ వ్యాఖ్యానించింది.