Begin typing your search above and press return to search.
మైకంలో చేసిన పని ఇప్పుడు కొంప ముంచె..!
By: Tupaki Desk | 20 Nov 2018 1:30 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కు చెందిన ప్రైవేట్ ఫొటోలు కొన్ని వారాల క్రితం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన విషయం తెల్సిందే. అక్షరకు సంబంధించిన అత్యంత రహస్యమైన - వ్యక్తిగతమైన ఫొటోలు బయటకు రావడంతో అంతా కూడా షాక్ అయ్యారు. మొదట స్పందించని అక్షర ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడం పై ఎంక్వౌరీ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఈమె ఆశ్రయించింది. పోలీసులు మెల్లగా తీగ లాగుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా లీక్ ఫొటోల విషయమై ఎంక్వౌరీ చేస్తుంటే ఆమె పాత ప్రేమ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది.
కొన్ని సంవత్సరాల క్రితం తనూజ్ అనే వ్యక్తితో అక్షర హాసన్ పీకల్లోతూ ప్రేమలో మునిగి పోయిందట. ఆ ప్రేమ మైకంలోనే తన పర్సనల్ ఫొటోలను - సెల్ఫీలను తనూజ్ కు అక్షర పంపింది. ఇద్దరి మద్య విభేదాల కారణంగా విడిపోయారు. ప్రేమికులుగా విడిపోయిన వారు స్నేహితులుగా కలిసి ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తనూజ్ కు పంపిన ఫొటోలు లీక్ అవ్వడంతో పోలీసులు ఆయన్ను అనుమానిస్తున్నారు. అయితే తనూజ్ మాత్రం ఆ ఫొటోలు తన ఫోన్ లో ఉన్న మాట వాస్తవమే. కాని ఆ ఫోన్ తాను ప్రస్తుతం వాడటం లేదు. ఆ ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో నాకు అర్థం కావడం లేదు అంటూ పోలీసుల ప్రాధమిక ఎంక్వౌరీలో తనూజ్ వెళ్లడి చేసినట్లుగా ముంబయి వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అప్పుడు ప్రేమ మత్తులో పంపనేలా, ఇప్పుడు మత్తు దిగినాక మొత్తుకోనేలా అంటూ అక్షర హాసన్ ఉదంతంపై కొందరు స్పందిస్తున్నారు. ఇందులో అక్షర హాసన్ తప్పు కూడా ఉందని మరి కొందరు అంటున్నారు.