Begin typing your search above and press return to search.
ఐదేళ్లయినా ఆమెను కష్టాలు వీడలేదట
By: Tupaki Desk | 22 July 2022 1:30 AM GMTఐదు సంవత్సరాల క్రితం బాలీవుడ్ తో పాటు దేశం లోని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను కుదిపేసిన విషయం మీటూ. ఈ రెండు అక్షరాల పదం దేశంలో ఒక ఉద్యమం ను జరిగేలా చేసింది. పదుల సంఖ్యలో సినీ సెలబ్రెటీలు ఇండియాలో మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు. వారందరికీ ఆదర్శం.. ఆధ్యం తనుశ్రీ దత్తా అనే విషయం తెల్సిందే.
ఆమె బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై చేసిన లైంగిక వేదింపుల ఆరోపణలు మీటూ ఉద్యమం ను ఇండియాలో ఉవ్వెత్తున ఎగసి పడేలా చేశాయి. ఇప్పటి వరకు మీటూ గురించి చర్చ జరుగుతూనే ఉందంటే కేవలం తనూశ్రీ దత్తా వల్లే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆమె వల్లే మీటూ ఉద్యమంలో భాగంగా సెలబ్రెటీలు మీడియా ముందుకు వచ్చారు.
మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చి బాలీవుడ్ లోనే చాలా పెద్ద స్టార్ ను ఆమె కోర్టుకు లాగే ప్రయత్నం చేసింది. ఆమె దారిలో చాలా మంది కూడా మీటూ అంటూ ఫిల్మ్ మేకర్స్ ను మరియు స్టార్స్ ను మీడియా ముందుకు లాగే ప్రయత్నాలు చేశారు. దాంతో ఆమెను అనధికారికంగా బాలీవుడ్ లో బ్యాన్ చేసినంత పని చేశారట.
మీటూ ఉద్యమం కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు విదేశాలకు వెళ్లిపోయిన తనూశ్రీ దత్తా మళ్లీ మొదలు పెట్టింది. 2018 లో తాను మీటూ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు కూడా తనను వేదిస్తున్నాయి. ఆ వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడ్డ వారు నన్ను ఇండస్ట్రీ నుండి తప్పించే ప్రయత్నాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు అన్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
ఎవరు ఎన్ని చేసినా కూడా నేను మాత్రం బాలీవుడ్ ను.. సినిమా పరిశ్రమ ను వదిలేది లేదని తనూశ్రీ దత్తా క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గా ఎన్నో సినిమా ల్లో నటించిన తనూశ్రీ దత్తా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికి కూడా కొందరు తనతో సినిమాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. వారు నన్ను ఒక దోషిగా చూస్తున్నారని తనూశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేసింది.
నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడం కోసం ఈమె ఇటీవల కాస్త బరువు కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. కనుక తప్పకుండా ఈమెకు బాలీవుడ్ లో అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.