Begin typing your search above and press return to search.
#MEETOO పోలీసుల్ని వదల బొమ్మాళీ
By: Tupaki Desk | 9 Dec 2019 4:12 AM GMTబాలీవుడ్ కథానాయిక తనుశ్రీ దత్తా మీటూ పేరుతో చేసిన హంగామా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. 30ఏళ్ల అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడిపై తనుశ్రీ ఆరోపణలతో బాలీవుడ్ ఒక్కసారిగా ఒణికిపోయింది. తనని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది మీటూ అంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. తనుశ్రీ దత్తా మరాఠీ రంగస్థల నటుడు నానా పటేకర్ పై మీటూ ఆరోపణలు చేయడంతో అది సర్వత్రా చర్చనీయాంశమైంది. అతనిపై చర్యలు తీసుకోవాలని సినిమాలు ఇవ్వకూడదని డిమాండ్ చేసింది తనూశ్రీ. దీంతో నానా పటేకర్ చాలా వరకు సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది.
సాజిద్ నడియావాలా రూపొందించిన `హౌస్ ఫుల్ 4` నుంచి నానా మధ్యలోనే తప్పుకోవడంతో ఆ స్థానంలో టాలీవుడ్ హీరో రానాను తీసుకుని మళ్లీ రీ షూట్ చేసుకున్నారు. అయితే ఆ తరువాతా ముంబై పోలీసులు నానా పటేకర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఆగ్రహించిన తనుశ్రీ దత్తా ముంబై పోలీసులపైనా తనదైన శైలిలో విరుచుకుపడడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.
తనూశ్రీ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తన పగను కంటిన్యూ చేస్తోంది. లేటెస్టుగా పోలీసులపైనా `బి సమ్మరి` పేరుతో వారిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సరైన ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముంబై పోలీసులు నానా పటేకర్ కు ఎలా క్లిన్ చిట్ ఇస్తారని తనుశ్రీ మండిపడుతోంది. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదలనని కరాకండీగా చెబుతోంది. దీంతో ముంబై పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. శివతాండవం ఆడుతున్న తనూశ్రీని బుజ్జగించడం ఎలానో అర్తంగాక నానా తంటాలు పడుతున్నారట.