Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ తో రక్తమోడుతూ గుడికెళ్లిన బాలయ్య హీరోయిన్

By:  Tupaki Desk   |   3 May 2022 4:37 PM GMT
యాక్సిడెంట్ తో రక్తమోడుతూ గుడికెళ్లిన బాలయ్య హీరోయిన్
X
'ఆషిక్ బనాయా ఆప్నే'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది తనుశ్రీ దత్తా. ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణతో 'వీరభద్ర' సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిచయమైంది. ఇక ఆ కొన్ని వ్యక్తిగత కారణాలతో బాలీవుడ్ కు దూరమైంది. ఈ నటి దాదాపు 11 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె విదేశాల నుంచి ముంబైకి కూడా వచ్చారు. అయితే ఆమెకు తాజాగా యాక్సిడెంట్ జరిగిన వార్త బయటకు వచ్చింది.

అమెరికాకు మకాం మార్చి అక్కడ సిటిజన్ షిప్ పొందిన తనుశ్రీ దత్తా అనంతరం ఇండియాకు తిరిగి వచ్చింది. అనంతరం మీటూ ఉద్యమంలో పలువురిపై ఆరోపణలు చేసింది. సహనటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాంబు పేల్చింది. మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె మళ్లీ అమెరికా వెళ్లిపోయారు.

తాజాగా తనుశ్రీ దత్తా యాక్సిడెంట్ కు గురైందన్న వార్త తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు.. ఫోటోలు షేరస్ చేస్తూ.. తను శ్రీ దత్తా తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఆమె ఉజ్జయిని మహంకాల్ ను సందర్వించేందుకు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ చేదు అనుభవాన్ని తను శ్రీ దత్తా సోషల్ మీడియాలో పంచుకుంది. తన జీవితంలో తొలిసారి ఇలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ రోడ్డు ప్రమాదం వల్ల తన నమ్మకం మరింత బలపడిందని ఆమె పేర్కొంది. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ రోజు ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురైనా తనుశ్రీ రక్తమోడుతూనే మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. గుడిలోపల తీసిన వీడియోను షేర్ చేశారు. తడబుతూ రక్తమోడుతూ తనుశ్రీ కనిపించింది. ఈ వీడియో వైరల్ అయ్యింది.

ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో తను శ్రీ పోస్ట్ పై సానుభూతి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.