Begin typing your search above and press return to search.
దేశంలో అలజడి రేపి..రిసార్టులో యోగా చేస్తోంది
By: Tupaki Desk | 31 Oct 2018 12:40 PM GMTబాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసి దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం రేపిన తనూశ్రీ దత్తా ప్రస్తుతం ప్రశాంత కోసం పూణె సమీపంలోని ఒక రిసార్టులో యోగా చేస్తూ కనిపించింది. మీటూ ఉద్యమం ఇతర దేశాల్లో ఎప్పటి నుండో ఉన్నా కూడా ఇండియాలో మీటూ ఉద్యమం ఈ స్థాయిలో చెలరేగడానికి ప్రధాన కారణం తనూశ్రీ దత్తా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనూశ్రీ దత్తా మొదలు పెట్టిన మీటూ ఉద్యమం పతాక స్థాయికి చేరింది.
పది సంవత్సరాల క్రితం హార్న్ ఓకే ప్లీజ్ చిత్రం షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేదించాడు అంటూ చెప్పుకొచ్చిన తనూశ్రీ దత్తా ఆ తర్వాత కూడా తన ఆరోపణలను కొనసాగించింది. నానా పటేకర్ తో పాటు మరో దర్శకుడిపై కూడా ఈమె ఆరోపణలు చేసింది. తనూశ్రీ దత్తాకు మద్దతుగా పెద్ద ఎత్తున హీరోయిన్స్ నిలిచారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్ తనూ శ్రీ దత్తాకు మద్దతు తెలిపారు. ఈ సమయంలోనే ఆమెపై విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా రాఖీ సావంత్ ఈమెపై సంచలన ఆరోపణలు చేసింది. తనూశ్రీ ఒక లెస్బియన్ అని - డ్రగ్స్ బాగా వాడుతుందని ఆరోపణలు చేసింది. రాఖీ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనూశ్రీ దత్తా పరువు నష్టం దావా వేసింది. గత కొన్ని రోజులుగా కోర్టు - కేసు - పిటీషన్స్ అంటూ నానా ఇబ్బందులు పడ్డ తనూశ్రీ దత్తా ప్రస్తుతం రిసార్ట్ లో యోగా చేసి - ప్రశాంత వాతావరణంలో గడుపుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.