Begin typing your search above and press return to search.
గోల్డ్: ప్రపోజల్ తో ముందుకొచ్చిన ఖిలాడి!
By: Tupaki Desk | 24 July 2018 5:53 AM GMTబాలీవుడ్లో ఇద్దరు హీరోలు మాత్రం డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటూ, స్టార్డం అంతా పక్కనబెట్టి విభిన్న పాత్రలకు పచ్చ జెండా ఊపుతూ ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు. వారిలో ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లో టాప్ రాంక్ లో ఉంటారు. అమీర్ సంగతి పక్కన బెడితే అక్షయ్ కుమార్ మాత్రం ప్రతి నాలుగు నెలలకో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. బాలీవుడ్ ఖిలాడిగా పేరుతెచ్చుకున్న అక్షయ్ ఈసారి 'గోల్డ్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హాకీ ఖిలాడీగా కనిపించడం విశేషం.
బ్రిటీష్ జమానా నేపథ్యంలో హాకీ థీమ్ తెరకెక్కిన సినిమా ఇది. తపన్ దాస్ అనే ఒక హాకీ ఆటగాడు భారతదేశం ఒలింపిక్స్ లో హాకీ సాధించడమే తన ధ్యేయంగా పెట్టుకుంటాడు. మరి ఆయనకు ఎన్ని సవాళ్ళు ఎదురయ్యాయి.. 1948 లో ఎలా 'గోల్డ్' మెడల్ గెలిచారు అనేది సినిమా థీమ్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రీసెంట్ గా 'గోల్డ్' టీం 'తపన్ దాస్ - ప్రపోజల్ డైలాగ్ ప్రోమో' అంటూ ఒక వీడియో ను రిలీజ్ చేశారు. అందులో తపన్ దాస్(అక్షయ్) ఇండియా టీమ్ గెలవడం కోసం ఒక ప్రపోజల్ తో Mr. వాడియా అనే ఓ పెద్దమనిషి దగ్గరకొస్తాడు. అక్కడ మరో అతను అక్షయ్ ని ఉద్దేశించి.. 'ఇస్ ఆద్మీ కా నామ్ పూరి దునియా మే ఖరాబ్ హై'( ఈయనకు ప్రపంచమంతా చెడ్డ పేరే).. అయన కు అక్షయ్ ఇచ్చే సమాధానం 'హం అప్నా నామ్ కా బాత్ నై కర్తా హై.. దేశ్ కా నామ్ కా బాత్ కర్తా హై'(నేను నా పేరు గురించి కాదు.. దేశం పేరు గురించి మాట్లాడుతున్నా). ఈ ఒక్క డైలాగ్ సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించారు.
మౌని రాయ్ - కునాల్ కపూర్ - అమిత్ సాద్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్ - రితేష్ సిధ్వాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రీమా కగ్తి దర్శకురాలు. ఈమె గతంలో 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్'.. అమీర్ ఖాన్ తో 'తలాష్' సినిమాలను తెరకెక్కించింది. 'గోల్డ్' సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15 న రిలీజ్ చేస్తున్నారు.