Begin typing your search above and press return to search.
ఫోటోస్టోరి: పచ్చని చిలుకలు తోడుంటే
By: Tupaki Desk | 14 July 2015 5:06 PM GMTపచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు.. అంటూ భారతీయుడు ఓ పాట పాడుకున్నాడు. ఇదిగో సైమా అవార్డుల కార్యక్రమానికి ఇలాంటి చిలకలు తోడుంటే చాలు. ఆటోమెటిగ్గా కుర్రకారు కళ్లన్నీ అక్కడ వాలిపోవడం ఖాయం. అందుకే తెలివైన సైమా నిర్వాహకులు క్యూట్ తాప్సీని, హాట్ అమలాపాల్‌ని రంగంలోకి దించారు. దుబాయ్‌లో జరగనున్న సైమా ఉత్సవాల్ని పురష్కరించుకుని ఉధృతంగా ప్రచారం చేసుకోవడానికి ఇలా కలరింగుని రంగంలోకి దించుతున్నారు.
తెల్లని తెలుపే మరు తెలుపే అంటూ తెల్లరంగు కాంబినేషన్ డ్రెస్సుల్లో అమలాపాల్, తాప్సీ అహూతుల్ని మైమరిపించారు. ముఖ్యంగా పెళ్లయినా అమలాపాల్‌లో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదనిపించింది. డిజైనర్ వైట్ డ్రెస్‌పై, అంతే చక్కగా ఉన్న వైట్ షూట్‌తో అదరగొట్టేసింది. మోడ్రన్ స్టయిల్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉందా లుక్. అలాగే మల్లె పువ్వు అంత అందమైన మోముతో చిరునవ్వులు చిందిస్తున్న తాప్సీ అదిరేటి డ్రెస్సు మేమేస్తే అంటూ కనిపించింది. ఈ రేంజులో ప్రచారం చేయిస్తుంటే కుర్రాళ్లతో దుబాయ్ విమానాలు రద్ధీగా మారిపోవడం ఖాయం. సైమా పేరు చెప్పి ఎయిర్‌లైన్స్ కిటకిటలాడిపోవడం ఖాయం.