Begin typing your search above and press return to search.

ఫ్యాషన్‌ సెన్స్‌లో ఆరితేరిన భామలు

By:  Tupaki Desk   |   7 July 2015 6:56 AM GMT
ఫ్యాషన్‌ సెన్స్‌లో ఆరితేరిన భామలు
X
అవకాశం దొరకాలే కానీ ఫ్యాషన్‌ అండ్‌ ట్రెండ్స్‌లో ఇరగదీసేస్తున్నారు మన ముద్దుగుమ్మలు. అవకాశం ఉన్న ప్రతి వేదికపైనా ప్రత్యేకమైన డిజైన్లతో సందడి చేస్తూ చూపరుల్ని కట్టి పడేస్తున్నారు. ఇలా ట్రెండ్‌ని ఫాలో చేస్తూ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న భామల్లో కాజల్‌, తమన్నా, తాప్సీ ముందు వరుసలో ఉన్నారు. వీలున్న ప్రతి వేదికపై ఏదో ఒక డిజైనర్‌ వేర్‌లో కనిపించి తళుకులీనుతున్నారు.

అసలు మనోళ్ళు ఇలా తళుక్కు మనడానికి కారణం ఏటై ఉంటుందంటారు? ఏముంది.. వీళ్ళ వలన సదరు బ్రాండ్స్‌కు ప్రమోషన్‌, ఆ బట్టల్లో వీరికీ ప్రమోషన్‌. ఇటీవలి కాలంలో తాప్సీ, కాజల్‌ ఇద్దరూ అమెరికా తానా, నాట్స్‌లో సందడి చేశారు. ఇక్కడికి వీళ్లు ప్రత్యేకమైన డిజైనింగ్‌ డ్రెస్సుల్లో విచ్చేశారు. అయితే ఈ భామలు ఇలా రావడానికి పుణ్యం, పురుషార్థం కారణమని అంటున్నారు. ఫన్‌ ఫ్యూజన్‌ ఔట్‌ఫిట్స్‌ అంటూ ఓ ట్రెండీ డ్రెస్సులకు ప్రమోషన్‌ చేశారు ఈ ముద్దుగుమ్మలు. ఎన్నారైల్లో ఈ డిజైన్స్‌ ఇప్పుడు పాపులర్‌ అయిపోతున్నాయి. దీన్నిబట్టి అసలు ఈ భామలిద్దరూ తానా ఉత్సవాలకు ఎందుకు వెళ్లారో అర్థమవుతోంది.

ఓవైపు ఎన్నారైలో సత్సంబంధాలు, మరోవైపు కార్పొరెట్‌ ప్రచారం రెండూ కలిసొస్తున్నాయనే దీనర్థం. అలాగే తమన్నా ప్రస్తుతం బాహుబలి ప్రచారం ముగించుకుంటోంది. పనిలో పనిగా వైట్‌ అండ్‌ వైట్‌ జువెలరీకి, ఫ్యూజన్‌ స్టయిల్‌ డిజైనర్‌ వేర్‌లకు ప్రమోషన్‌ చేసేస్తోంది తెలివిగా. మొత్తానికి ఫ్యాషన్‌ తళుక్కుల్లో తెలుగు హీరోయిన్స్‌ అలా మెరుస్తున్నారనమాట.