Begin typing your search above and press return to search.
హైద్రాబాద్ రోడ్లపై తాప్సీ చక్కర్లు..
By: Tupaki Desk | 22 Jan 2016 1:30 PM GMTతాప్సీ పన్ను రేంజ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇంతకు ముందు వరుస ఫ్లాప్స్ కారణంగా., తన కెరీర్ పైనే దృష్టి పెట్టేది ఈ ఢిల్లీ సుందరి. అయితే గంగతో హిట్ కొట్టిన తర్వాత ఈ భామకి.. దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. ఎడాపెడా నోరు కూడా చేసుకుంటోంది. కాకపోతే తన ఒపీనియన్స్ ని చెప్పే విషయంలో మాత్రమే. ప్రస్తుతం తాప్సీ హైద్రాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతోంది.
ఐఫా అవార్డు ఉత్సవాల్లో పాల్గొనడానికి భాగ్యనగరానికి వచ్చిన ఈ భామ.. తెగ డ్యాన్సులు ప్రాక్టీసు చేస్తోంది. ఈవెంట్ లో ఈమెవి డ్యాన్స్ ప్రదర్శనలు కూడా ఉండడమే ఇందుకు రీజన్. మధ్యలో బ్రేక్ రాగానే.. బైక్ వేసుకుని ఎంచక్కా రోడ్లపై షికార్లు వెళ్లిపోతోంది. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ లో పోస్ట్ చేసి చెప్పింది కూడా. మంచి వాతావరణం తనను బైకింగ్ కి రమ్మని పిలుస్తోందని, దీనికి తోడు అనేక బైక్స్ అందుబాటులో ఉన్నపుడు, ఇలా బైక్ రైడ్స్ చేయాలనే కోరిక మరింత పెరుగుతుందని అంటోంది తాప్సీ. ప్రస్తుతం హిందీ-తెలుగు భాషల్లో రూపొందుతున్న ఘాజీ మూవీలో.. దగ్గుబాటి రాణా - కేకే మీనన్ లతో కలిసి ఈ ఢిల్లీ బ్యూటీ నడుస్తోంది.
రీసెంట్ గా పురుషాధిక్యత అంటూ ఈమె చేసిన కామెంట్స్ బాగానే సంచలనం సృష్టించాయి. ఒక మహిళ కష్టంలో ఉంటే ఒక్క మగవాడు కూడా సాయం చేయడానికి రాడని.. ఒక మహిళకు సాయం చేయడానికి మరో మహిళే ముందుకు రావాలని అనింది తాప్సీ. దశాబ్దాలుగా మగవారి ఆధిపత్యంలో మహిళలు నలిగిపోతున్నారంటూ ఆవేదన పడిపోయి ఆవేశం కూడా వ్యక్తం చేసేసింది.