Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 7:30 AM GMT
సినీ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..!
X
'ఝుమ్మందినాధం' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నూ.. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తూ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న తాప్సీ.. 12 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుంది. అలానే నేడు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హాట్ బ్యూటీ.. ఈ పన్నేండేళ్లలో ఇండస్ట్రీలో మహిళల పట్ల వ్యవహరించే తీరులో పెద్దగా మార్పు ఏమీ లేదని కీలక వ్యాఖ్యలు చేసింది.

మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉందని.. తన కెరీర్ ప్రారంభం నుంచీ ఇది చూస్తూనే ఉన్నట్లు తాప్సి తెలిపింది. షూటింగ్‌ లొకేషన్‌ దగ్గర నుంచి.. అకామిడేషన్ - ఇతర సౌకర్యాలు - రెమ్యూనరేషన్ వరకూ అందరూ మేల్‌ - ఫీమేల్‌ అనే తేడాలు చూపిస్తున్నారని పేర్కొంది. స్టార్స్ ను ఒక విధంగా మిగతా వాళ్లకు మరో విధంగా ట్రీట్ చేస్తారని చెప్పింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఇచ్చే కార్వాన్లు అగ్గి పెట్టెల్లా ఉండేవని.. అదే హీరోలకు - పేరున్న నటులకు డబుల్‌ డోర్‌ వెహికిల్స్‌ ఏర్పాటు చేసేవారని తాప్సీ తెలిపింది. మేకప్‌ - కాస్ట్యూమ్‌ - హెయిర్‌ స్టైలిస్ట్‌.. ఇలా హెల్పర్స్ విషయంలోనూ చిన్న చూపు ఉంటుందని చెప్పింది.

హీరోయిన్ గా ఒక స్టార్ డమ్ వచ్చిన తరువాత పరిస్థితుల్లో మార్పులు వచ్చేవని.. కానీ ఎంత మార్పు వచ్చినా హీరో కంటే తక్కువగానే చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోలతో పోల్చితే తమ రెమ్యునరేషన్స్ లో చాలా తేడా ఉంటుందన్నారు తాప్సీ.

అయితే నిర్మాతగా మారిన తర్వాత సెట్స్‌ లో ఈ తేడాలు లేకుండా చూసుకుంటున్నాను అని తాప్సీ తెలిపింది. మహిళలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతున్నానని చెప్పింది. ఇటీవల 'శభాష్ మిథు' సినిమా రిలీజ్ టైంలోనూ.. సినిమా ఇండస్ట్రీలో స్త్రీ, పురుష సమానత్వం ఉండదని సీనియర్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. కానీ ఇప్పటికీ స్త్రీ, పురుష సమానత్వానికి తాము దూరంగానే ఉన్నామని తాప్సి చెప్పింది. తన సినిమా బడ్జెట్ మొత్తం కలిపితే ఎంత ఉంటుందో.. ఒక హీరో రెమ్యునరేషన్ అంత ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు సమానత్వం వైపు తాము అడుగులు వేస్తున్నామని.. ఆ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తాప్సి పన్ను చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్ తో 'డంకీ' మూవీతో పాటుగా 'బ్లర్' 'ఓ లడికీ కహా హై' 'దో బరా' వంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళ్ లో 'ఏలియన్' 'జనగణమన' వంటి చిత్రాలు చేస్తోంది. ఇక ఔట్‌ సైడర్స్‌ ఫిలింస్‌ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తోంది. 'బ్లర్‌' - 'ధక్‌ ధక్' చిత్రాలు తాప్సి ప్రొడక్షన్ లో రూపొందుతున్నాయి. ఇదే క్రమంలో సమంత రూత్ ప్రభు తో ఓ హిందీలో ఓ మూవీని నిర్మించనుంది.