Begin typing your search above and press return to search.
కంగనా ఇచ్చిన గ్రేడ్ కు తాప్సి కౌంటర్
By: Tupaki Desk | 20 July 2020 11:10 AM GMTమీడియా ముందుకు వస్తే ఎవరిపైనో ఒకరిపైన సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అవ్వడం కంగనా స్టైల్. ఆమె ఏదో ఒక విషయమై ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అవతలి వారు ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా తనకు అనిపించిన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ చేస్తూ కంగనా బాలీవుడ్ జనాలను కంగారు పెడుతూనే ఉంది.
మళ్లీ కంగనా రెచ్చి పోయింది. ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో కంగనా మాట్లాడుతూ బాలీవుడ్ మాఫియాకు సపోర్ట్ చేస్తున్న తాప్సి మరియు స్వరా భాస్కర్ లను బి గ్రేడ్ హీరోయిన్స్ అంటూ విమర్శించింది. వారు మంచి ప్రతిభ ఉన్న వారు అయినా కూడా కరణ్ జోహార్ వంటి వారి భజన చేయడం వల్ల బి గ్రేడ్ హీరోయిన్స్ అయ్యారంటూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
కంగనా చేసిన వ్యాఖ్యలను తాప్పి చాలా లైట్ గా తీసుకున్నట్లుగా అనిపించింది. అయితే కౌంటర్ మాత్రం క్లీయర్ గా ఉండేలా ఇచ్చింది. నేను చదువుకునేప్పుడు 10 మరియు 12వ తరగతులకు నెంబర్స్ లో గ్రేడ్స్ ఇచ్చే వారు. కాని ఈ కొత్త గ్రేడ్స్ ఏంటో అన్నట్లుగా తాప్సి ట్వీట్ చేసింది. కంగనా వ్యాఖ్యలకు తాప్సి కౌంటర్ అదిరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక కరణ్ జోహార్ విషయంలో మొదటి నుండి కూడా తాప్సి క్లారిటీ ఉన్నట్లుగా చెబుతుంది. ఆయన్ను నెత్తికి ఎత్తుకునేలా ప్రశంసలు చేసి వ్యాఖ్యలు చేసిన సందర్బాలు లేవు. అలా అని ఆయన్ను విమర్శించాల్సిన అవసరం నాకు రాలేదు అంటూ తాప్సి పేర్కొంది. కంగనాతో డైరెక్ట్ గా తాప్సి పెట్టుకోకుండానే కౌంటర్స్ ఇస్తుంది. గతంలో జుట్టు విషయంలో కూడా కర్లింగ్ హెయిర్ పేటెంట్ హక్కు ఏమైనా ఆమె వద్ద ఉందా? నాకు పుట్టుకతో కర్లింగ్ హెయిర్ ఉంది. అదే ఇప్పుడు కూడా. దానికి కాపీ కొట్టడం అంటూ విమర్శించడం ఏంటీ అంటూ ప్రశ్నించింది.