Begin typing your search above and press return to search.

ఆ సమయంలో కంగనా నాకెందుకు మద్దతు ఇవ్వలేదు?

By:  Tupaki Desk   |   26 July 2020 3:30 PM GMT
ఆ సమయంలో కంగనా నాకెందుకు మద్దతు ఇవ్వలేదు?
X
సుశాంత్‌ మృతి చెందినప్పటి నుండి బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తు విమర్శలు గుప్పిస్తున్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌ పై హీరోయిన్‌ తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరు చాలా కాలంగా మాటల యుద్దం జరుగుతోంది. కంగనాను తాప్సి కాపీ కొడుతోంది అంటూ రంగోలీ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి వీరిద్దరి మద్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం తాప్సిని బి గ్రేడ్‌ హీరోయిన్‌ అంటూ కంగనా కామెంట్స్‌ చేసింది.

కంగనా బి గ్రేడ్‌ వ్యాఖ్యలకు ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చిన తాప్సి మరోసారి ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగనాపై కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం నెపొటిజం గురించి తెగ కామెంట్స్‌ చేస్తున్న కంగనా గతంలో తాను నెపొటిజం కారణంగా అవకాశాలు కోల్పోయినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించింది. స్టార్‌ వారసుల కోసం చాలా సినిమాల నుండి నన్ను తప్పించారు. ఆ విషయాన్ని నేను గతంలోనే మీడియా ముందు చెప్పాను. మరి ఆ సమయంలో కంగనా నాకు మద్దతుగా ఎందుకు నిలవలేదని తాప్సి ప్రశ్నించింది.

కంగనా నాకు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎవరికి కూడా సాయం చేయదు. ఆమె ఇప్పటి వరకు ఏ ఒక్క ఔట్‌ సైడర్‌ కు అండగా నిలిచిన సందర్బం లేదు. సుశాంత్‌ మాదిరిగానే నేను కూడా ఎవరి సాయం లేకుండా కెరీర్‌ లో ముందుకు సాగుతున్నాను. నాకు ఏ ఒక్క స్టార్‌ మద్దతుగా నిలవలేదు. పైగా నన్ను కొందరు విమర్శలతో పదే పదే తక్కువ చేసేలా మాట్లాడుతున్నారంటూ కంగనాకు కౌంటర్‌ ఇచ్చింది.