Begin typing your search above and press return to search.
తాప్సీ.. ఆటలు మామూలుగా లేవుగా..!
By: Tupaki Desk | 23 Feb 2021 1:30 PM GMT'తాప్సీ పన్నూ..' గ్లామర్ రోల్స్ కు ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టిన ఈ బ్యూటీ.. కొంతకాలంగా తనలోని నటిని సంతృప్తి పరిచే పాత్రలే చేస్తోంది. టాలీవుడ్ నుంచి సినీ జర్నీ స్టార్ చేసిన తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ జెండా పాతేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న వారిలో తాప్సీ ముందు వరసలో ఉంది.
ఇప్పుడు తాప్సీ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. 'హసీన్ దిల్ రుబా, రశ్మీ రాకెట్, లూప్ లపేటా, శభాష్ మిథూ'. ఈ నాలుగు సినిమాల్లో రశ్మీరాకెట్ లో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. శభాష్ మిథూ లో క్రికెటర్ పాత్ర పోషిస్తోంది. ఇవి రెండూ బయోపిక్ లే కావడం విశేషం. 'శభాష్ మిథూ' అనేది మన హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్.
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా అద్భుతాలు సృష్టించిన మిథాలీ రాజ్ నిజ జీవితంలో ఎందరికో ఇన్ స్పిరేషన్. అందుకే.. ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. వెండితెరపై మిథాలీ రాజ్ గా తాప్సీ కనిపించబోతోంది. అయితే.. ఆషామాషీగా కాకుండా.. ప్రొఫెషనల్ ప్లేయర్ గా స్క్రీన్ పై కనిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది తాప్సీ. ఇందులో భాగంగా.. సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది తాప్సీ.
మిథాలీ రాజ్ స్నేహితురాలు నూషిన్ అల్ ఖాదర్ ఆధ్వర్యంలో బ్యాటింగ్, బౌలింగ్ లో శిక్షణ పొందుతోంది. నూషిన్ కూడా గతంలో ఇండియన్ ఉమన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ క్రమంలో మిథాలీ గేమ్ ను క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది నూషిన్. అందుకే.. తాప్సీ ఆమె వద్ద ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇందుకోసం తీవ్రంగా సాధన చేస్తోంది తాప్సీ.